యాప్నగరం

కేరళ ఛాయ్‌వాలా తెలివితేటలు.. వరదలో కాలు కదపకుండానే కస్టమర్లకు ఛాయ్

తెలివితేటలు ఉంటే చాలు ప్రతికూల పరిస్థితులను సైతం అనుకూలంగా మలుచుకోవచ్చని ఈ కేరళ చాయ్‌వాలా నిరూపించాడు.

Samayam Telugu 23 Aug 2018, 4:01 pm
వరదల కారణంగా విలవిల్లాడిన కేరళ మెల్లగా కోలుకుంటోంది. వరద పూర్తిగా తగ్గకపోయినా.. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వరద తీవ్రతను కళ్లకు కట్టే బోలెడన్ని వీడియోలు బయటకొచ్చాయి. సైనికులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ బాధితులను కాపాడిన దృశ్యాలు కట్టిపడేశాయి. కానీ ఓ ఛాయ్‌వాలా వరద నీటిలో ఛాయ్ పెట్టి విక్రయిస్తోన్న వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది.
Samayam Telugu chaiwala


మోకాల్లోతు వరద నీళ్లలో టీ పెట్టడంతోపాటు.. ఆ నీటినే తనకు అనుకూలంగా మార్చేసుకొని కాలు కదపకుండానే కస్టమర్లకు టీ అందిస్తోన్న ఛాయ్‌వాలా తన తెలివితేటలతో ఔరా అనిపించాడు. తెలివితేటలు ఉంటే చాలు ప్రతికూల పరిస్థితులను సైతం అనుకూలంగా మలుచుకోవచ్చని నిరూపించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.