యాప్నగరం

వీడియో వద్దు.. అక్షరాలే ముద్దు..

పుట్టీ పుట్టడంతోనే డిజిటల్ టెక్నాలజీని చేతబట్టుకుని పుడుతున్నారని పేరొందిన ఈ తరపు యువతరం గురించి ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది.

TNN 12 Oct 2016, 11:23 pm
పుట్టీ పుట్టడంతోనే డిజిటల్ టెక్నాలజీని చేతబట్టుకుని పుడుతున్నారని పేరొందిన ఈ తరపు యువతరం గురించి ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది. టెక్నాలజీ వాడకంలో ఎంత ముందంజలో ఉన్నప్పటికీ వార్తలను తెలుసుకునే విషయానికి వచ్చేసరికి వారు వీడియోల కన్నా సాంప్రదాయక పద్ధతిలో అక్షరాల రూపంలో చదువుకోవడానికే ఆసక్తి కనబరుస్తున్నారని ప్యూ రీసెర్చ్ ఫౌండేషన్ సర్వేలో తేలింది. అమెరికా జనాభాలో 42 శాతం మంది వార్తలను చదివి తెలుసుకునేందుకు మొగ్గుచూపుతామని వెల్లడించారు. అది చేతితో దినపత్రికను పట్టుకుని చదవడం కానీయండి, ఆన్‌లైన్లో న్యూస్ వెబ్‌సైట్లలోని వార్తల కంటెంట్ కానీయండి.. చదవడం మాత్రం పక్కాగా జరిగి తీరాల్సిందే. ఇక 19శాతం మంది మాత్రం వార్తలను వినడానికి ఇష్టపడతామని చెప్పారు. మిగిలిన వారు వార్తలను వీడియో రూపంలో తెలుసుకుంటామన్నారు.
Samayam Telugu todays generation prefer to get their news in text not video
వీడియో వద్దు.. అక్షరాలే ముద్దు..


18 నుండి 29 ఏళ్ల లోపు యువతరంలో 42 శాతం మంది వార్తలను చదివేందుకు ఇష్టపడుతుండగా, 38 శాతం మంది వీడియో బులెటిన్లు చూస్తామన్నారు. 19శాతం మంది వార్తలను వినడమంటేనే ఇష్టమన్నారు.


ఇక 30-49 ఏళ్ల లోపు వారిలో 40 శాతం మందికి రీడింగ్ హ్యాబిట్ ఉంది. ఈ వయసు గ్రూపు వారిలో 39శాతం మంది వార్తలను చూస్తామన్నారు. 20శాతం మంది వార్తలను వింటామన్నారు.

50 నుండి 64 ఏళ్ల మధ్య వయసు గ్రూపు వారిలో కేవలం 29శాతం మంది మాత్రమే వార్తలను చదువుతున్నారు. 52శాతం మంది వార్తలను వీడియో రూపంలో చూస్తున్నారు. 17 శాతం మంది వింటున్నారు.

65 ఏళ్లు పైబడిన సీనియర్ తరంలో 27 శాతం మంది మాత్రమే వార్తలను చదువుతుండగా, అత్యధికంగా 58శాతం మంది వార్తల వీడియోలు చూస్తున్నట్లు సర్వే చెప్పింది. ఈ వయసు వారిలో 10 శాతం మంది వార్తలను వింటామని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.