యాప్నగరం

కీచక గురువుకు బయపడి బడి మానేసిన బాలికలు!

అజ్ఞానమనే చీకట్లను పారద్రోలి జ్ఞాన జ్యోతులు వెలిగించి పిల్లల భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన గురువులే మృగాలుగా తయారవుతున్నారు.

TNN 7 Feb 2017, 12:17 pm
అజ్ఞానమనే చీకట్లను పారద్రోలి జ్ఞాన జ్యోతులు వెలిగించి పిల్లల భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన గురువులే మృగాలుగా తయారవుతున్నారు. రెండు అక్షరం ముక్కలు నేర్చుకోవాలనే ఆశతో కొండలు దాటి వచ్చిన గిరిజన విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడో టీచర్. అడవిలోని జంతువులను తప్పించుకుని పాఠశాలకు చేరుతున్న ఆ బాలికలకు ఉపాధ్యాయుడే ప్రమాదమయ్యాడు.
Samayam Telugu tribal girls drop out of tamil nadu school after sexual abuse by teacher
కీచక గురువుకు బయపడి బడి మానేసిన బాలికలు!


అతగాడి దుశ్చర్యలకు బయపడి పాఠశాలకు వెళ్లడం మానేశారు ఆ విద్యార్ధినిలు. ఈ ఘటన తమిళనాడులోని కరమడై సమీపంలోని బరాలీ పవర్ హౌస్ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. రెండు మాసాల కిందట పాఠశాలను తనిఖీ చేయడానికి సర్వశిక్ష అభియాన్‌ బృందం వచ్చినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో ఎక్కువ మంది బాలికలు హాజరుకాకపోవడాన్ని గమనించిన అధికారులు బాలికల తల్లిదండ్రులను కలవడంతో నిజం బయటపడింది.

పదవీ విరమణకు దగ్గరలో ఉన్న ఆర్‌. రవిచంద్రన్‌ అనే సైన్స్‌ ఉపాధ్యాయుడు విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని తల్లిదండ్రులు తెలిపారు. దీంతో తమ పిల్లలు పాఠశాలకు వెళ్లడంలేదని పేర్కొన్నారు. నిందితుడిపై చర్య తీసుకోవడానికి పై అధికారులతో సంప్రదింపులు జరిపినట్లు ఎస్‌ఎస్‌ఏ అధికారులు పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారని, దానిపై విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని కోయంబత్తూర్‌ డీఈవో కే తెనిమొళి తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.