యాప్నగరం

సిద్ధాంత బేదాలు మనకు సీఎంలకు కాదు

త్రిపురలో విజయబావుటా ఎగరేసిన కాషాయదళం నేత విప్లవ్, వామపక్ష కురువృద్ధుడైన మాణిక్ సర్కార్‌కు పాదాబివందనం చేస్తూ ఆశీర్వాదం తీసుకోవడంపై సర్వత్రా చర్చ నెలకొంది.

TNN 6 Mar 2018, 9:30 pm
త్రిపురలో లెఫ్ట్ సర్కారును పడగొట్టి కాషాయ జెండాను ఎగరేసిన విప్లవ్ దేబ్ త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకోవడం వివాదాస్పదం అవుతోంది. ఈ ప్రపంచానికి కమ్యూనిజం బాటలు చూపిన లెనిస్ విగ్రహాన్ని బీజేపీ నేతలు, కార్యకర్తలు త్రిపురలో కూల్చేస్తున్న తరుణంలో మాణిక్ సర్కార్ కాళ్లను విప్లవ్ దేవ్ మొక్కే ఫొటో వెలుగులోకి రావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.
Samayam Telugu tripura cm viplav kumar dev taking blessing from manik sarkar viral image
సిద్ధాంత బేదాలు మనకు సీఎంలకు కాదు


త్రిపురలో విజయబావుటా ఎగరేసిన కాషాయదళం నేత విప్లవ్, వామపక్ష కురువృద్ధుడైన మాణిక్ సర్కార్‌కు పాదాబివందనం చేస్తూ ఆశీర్వాదం తీసుకోవడంపై సర్వత్రా చర్చ నెలకొంది. అయితే ఈ ఫొటో సరిగ్గా ఎప్పుడు తీశారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత స్వయంగా విప్లవ్ దేవ్ మాణిక్ సర్కార్ ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కాంగీ, కమ్మీలు అంటూ కాంగ్రెస్, వామపక్ష పార్టీలను బీజేపీ దుమ్మెత్తి పోస్తే, మతతత్వపార్టీ అంటూ బీజేపీపై వామపక్షాలు మండిపడుతూ ఉంటాయి. ఇక బీజేపీది రైట్ భావజాలమని, వామపక్షాలది లెఫ్ట్ భావజాలమని అంటూ ఉంటారు. అయితే ఇవన్నీ బయటకు చెప్పేవి మాత్రమే అని లోలోపల అంతా ఒక్కటే అని పలు సందర్భాల్లో తేలిపోతూ ఉన్నా కింది స్థాయి కార్యకర్తల తలకు మాత్రం ఎక్కడం లేదు. కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో సిద్ధాంతం పేరుతో బీజేపీ, లెఫ్ట్ కార్యకర్తలు ఒకరి ప్రాణాలు మరొకరు తీసుకునేందుకు కూడా వెనకాడడం లేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.