యాప్నగరం

జల్లికట్టు వివాదం: ట్వీటర్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసిన త్రిష

జల్లికట్టు వివాదం నేపథ్యంలో మనస్తాపానికి గురైన త్రిష తన ట్వీటర్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేశారు.

TNN 15 Jan 2017, 12:59 pm
జల్లికట్టు వివాదం నేపథ్యంలో సినీ నటి త్రిష తన ట్వీటర్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేశారు. జంతు పరిరక్షణ సంస్థ అయిన పెటాకు తమిళనాట ప్రచారకర్తగా ఉన్న త్రిష జల్లికట్టును వ్యతిరేకిస్తూ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమెకు వ్యతిరేకంగా పలువురు ట్వీట్లు గుప్పించారు. ఒకానొక దశలో ఈ విమర్శలు శృతిమించాయి. పెటా ప్రచారకర్త త్రిష ఇక లేరంటూ.. ఆమె మరణించారంటూ కొందరు ట్వీట్లు చేశారు. ఈ పరిణామాలతో తీవ్ర మనస్థాపానికి గురైన నటి తన అకౌంట్‌ను డీయాక్టివేట్ చేశారు.
Samayam Telugu trisha deactivates twitter account over jallikattu row
జల్లికట్టు వివాదం: ట్వీటర్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసిన త్రిష


నేను తమిళ వ్యక్తిని. నేను పెటాకు మద్దతునిస్తాను. ఎంతటి చరిత్ర ఉన్నప్పటికీ జంతువులను హింసించడం న్యాయం కాదు. జల్లికట్టును నిషేధించాలి అంటూ ఆమె ఖాతాలో ట్వీట్ పోస్టు చేశారు. తర్వాత ఆమె మరో ట్వీట్ చేస్తూ.. ఇంతకు ముందు చేసిన ట్వీట్‌ను తాను పోస్ట్ చేయలేదని తన అకౌంట్‌ను హ్యాక్ చేశారని చెప్పింది. తర్వాత తన ట్వీటర్ అకౌంట్‌ను డీ యాక్టివేట్ చేస్తున్నట్లు మరో ట్వీట్ చేసింది.

త్రిష జల్లికట్టును వ్యతిరేకించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కొందరు తమిళియన్లు.. ఆమె నటిస్తోన్న సినిమా షూటింగ్‌కు అడ్డుపడ్డారు. దీంతో ఆమె షూటింగ్‌ను నిలిపివేయాల్సి వచ్చింది.

ఈ వ్యవహారం మొత్తాన్ని గమనిస్తోన్న తోటి తమిళ నటులు కమల్ హాసన్, రాధిక శరత్ కుమార్, శింబు తదితరులు త్రిషకు మద్దతు పలికారు. త్రిషను ఇబ్బంది పెట్టొందంటూ కమల్ హాసన్ తమిళ ప్రజలకు ట్వీట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.