యాప్నగరం

ఆ దర్గాను సందర్శించనున్న భూమాత సైన్యం

దర్గాలోకి మహిళలను అనుమతించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన తర్వాత ‘భూమాత బ్రిగేడ్’ నేత తృప్తి

Samayam Telugu 3 Dec 2016, 12:00 pm
దర్గాలోకి మహిళలను అనుమతించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన తర్వాత ‘భూమాత బ్రిగేడ్’ నేత తృప్తి దేశాయ్ సహా కార్యకర్తలతో ఇవాళ (శనివారం) దక్షిణ ముంబైలో ఉన్న హజీ అలీ దర్గాను సందర్శించనున్నారు.
Samayam Telugu trupti desai visits haji ali dargah today
ఆ దర్గాను సందర్శించనున్న భూమాత సైన్యం


వందలాది మంది మహిళా సామాజిక కార్యకర్తలు నవంబర్ 29న ఈ దర్గాను సందర్శించారు.

దర్గాలోకి మహిళలను అనుమతించాలని తృప్తి దేశాయ్ నాయకత్వంలో భూమాత బ్రిగేడ్ తరపున 2011 నుంచి న్యాయపోరాటం చేస్తున్నారు. ముస్లిం మహిళలు దర్గాలోకి రావడం పాపమని హజీ అలీ దర్గా ట్రస్ట్ నిషేదం విధించింది. దీంతో భూమాత బ్రిగేడ్....బాంబే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా న్యాయ పోరాటం చేసింది.

యేడాది అక్టోబర్ 24న బాంబై హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు..మహిళలను దర్గాల్లోకి అనుమతించాల్సిందేనని స్పష్టం చేసింది.

‘మా ఉద్యమానికి ఇది చారిత్రాత్మక విజయం. మా డిమాండ్ తప్పు కాదు. మేం ఏ మతానికి వ్యతిరేకం కాదు. హజీ అలీ దర్గాను ఇవాళ సందర్శిస్తున్నాం. ఏ సమస్యలు ఉత్పన్నం కావని నా నమ్మకం’ అని తృప్తీ దేశాయ్ అన్నారు.

గతంలో ఆమె ఇదే దర్గాను సందర్శించడానికి కార్యకర్తలతో కలిసి వెళ్లినప్పుడు దాడి జరిగింది. ఈనేపథ్యంలో భూమాత బ్రిగేడ్ సందర్శన సందర్భంగా దర్గా ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.