యాప్నగరం

బట్టలూడదీసి కొట్టారు.. ఆపై ఊరేగించారు

తన కూతుర్ని వేధిస్తున్నాడన్న అనుమానంతో ఓ తండ్రి మరో నలుగురితో అనుమానిత బాలుడితో పాటు అతని స్నేహితుడిని

TNN 19 May 2017, 2:53 pm
తన కూతుర్ని వేధిస్తున్నాడన్న అనుమానంతో ఓ తండ్రి మరో నలుగురితో అనుమానిత బాలుడితో పాటు అతని స్నేహితుడిని చితకబాదారు. అంతటితో ఆగకుండా ఆ ఇద్దరు బాలురను బట్టలూడదీసి ఊరేగించారు. ఈ షాకింగ్ సంఘటన మంగళవారం పుణేలోని వజ్రే మాల్వాడి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Samayam Telugu two boys beaten paraded naked by group of people in pune
బట్టలూడదీసి కొట్టారు.. ఆపై ఊరేగించారు


బాలురను నగ్నంగా ఊరేగించడాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.

వివరాల్లోకి వెళ్తే.. కార్వేనగర్ లోని ఓ బాలిక చదువుకుంటున్న పాఠశాలలోనే బాధితుల్లో ఒకరైన బాలుడు (14) చదువుకుంటున్నాడు. ఈ బాలుడు బాలికను వేధిస్తున్నట్లుగా బాలిక తండ్రి గతకొంతకాలంగా అనుమానిస్తున్నాడు. దీంతో మంగళవారం రాత్రి అమ్మాయి స్కూళ్లో చదువుకునే బాలుడితో పాటు అతని స్నేహితుడు (13) ఉన్న చోటికి వెళ్లాడు బాలిక తండ్రి. నలుగురిని వెంటబెట్టుకెళ్లిన ఆయన ఆ ఇద్దరు బాలురపై దాడి చేశారు. అంతటితో ఆగకుండా నగ్నంగా ఊరేంగించారు.

బాలురను నగ్నంగా ఊరేగించిన వీడియో ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

#WATCH Pune: 2 boys beaten & paraded naked by group of men after they allegedly molested a girl.4 arrested in connection with this act(16/5) pic.twitter.com/SmvcNC979Y— ANI (@ANI_news) May 19, 2017
బాధితుల్లోని ఒకరి తల్లి ఆ వీడియో చూసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ కొడుకును అకారణంగా కొట్టారని ఆమె ఫిర్యాదులో ఆరోపించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దాడికి పాల్పడ్డ వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.