యాప్నగరం

మోదీని కించపరుస్తూ వాట్సాప్, కేసు నమోదు

ప్రధానమంత్రి నరేంద్రమోదీని కించపరుస్తూ వాట్సాప్‌లో అశ్లీల సందేశాలు, ఫొటోలు పోస్టు చేసిన ఇద్దరు యువకులపై కేసు నమోదైంది.

TNN 5 Oct 2016, 11:26 am
ప్రధానమంత్రి నరేంద్రమోదీని కించపరుస్తూ వాట్సాప్‌లో అశ్లీల సందేశాలు, ఫొటోలు పోస్టు చేసిన ఇద్దరు యువకులపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే..ఆగ్రాలోని బర్హన్ కు చెందిన ఇద్దరు యువకులు ‘అహ్రాన్ కే హమ్ లోగ్’ అనే వాట్సాప్ గ్రూపు పేరుతో పీఎం మోదీని కించరపరుస్తూ పోస్టింగ్స్ చేస్తున్నారు. దీంతోపాటు ఆయన ఫొటోలకు మార్పింగ్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని స్థానిక బీజేపి నేత పుష్పేందర్ సిసోడియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు..ఆ గ్రూపును క్రియేట్ చేసిన ఆరీఫ్ పై ఆయనతో మోదీపై ఫొటోలు పోస్ట్ చేస్తున్న ఆజాద్ ఖాన్ లపై కేసు నమోదు చేశారు.
Samayam Telugu two youths booked for objectionable post against modi
మోదీని కించపరుస్తూ వాట్సాప్, కేసు నమోదు

అయితే గ్రూపు అడ్మిన్ ఆరీఫ్ ను అరెస్టు చేయగా..ఫొటోలు పోస్ట్ చేసిన ఆజాద్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.