ఎనిమిదో తరగతి చదువుతున్న ఆడ పిల్లలను ఘోరంగా అవమానించాడు ఆ హెడ్ మాస్టర్. కనీసం మానవత్వం కూడా చూపించకుండా దుస్తులు విప్పించి స్కూలు చుట్టూ తిప్పించాడు. ఈ అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్ లోని సోన్బదరా జిల్లాలో జరిగింది. తెలిసిన సమాచారం మేరకు శనివారం ఎనిమిదో తరగతి చదువుతున్న ఆడపిల్లలపై హెడ్ మాస్టర్ ఆగ్రహించాడు. అతని కోపానికి కారణం తెలియరాలేదు. అయితే శిక్షగా ఆ ఆడపిల్లలను దుస్తులు విప్పేసి స్కూలు చుట్టు తిరగమని ఆదేశించాడు. అలా రెండు గంటలపాటూ నగ్నంగా తిప్పించిన హెడ్ మాస్టర్... వారిని తన మొబైలో వీడియో కూడా తీశాడు. జరిగిన సంఘటన గురించి పిల్లలు ఇంటికి వచ్చాక తల్లిదండ్రులు చెప్పారు. తల్లిదండ్రులు జిల్లా మెజిస్ట్రేట్ కు ఫిర్యాదు చేశారు. ఆయన సోమవారం సదరు కీచక మాస్టర్ ను విధుల నుంచి తొలగించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు.
దుస్తులు విప్పించిన కీచక హెడ్ మాస్టర్
ఎనిమిదో తరగతి చదువుతున్న ఆడ పిల్లలను ఘోరంగా అవమానించాడు ఆ హెడ్ మాస్టర్
TNN 7 Feb 2017, 3:21 pm