యాప్నగరం

మళ్లీ వార్తల్లోకెక్కిన వరుణ్ సందేశ్ భార్య

నాలుగు రోజుల క్రితం మీడియాలో వచ్చిన వార్తలతో సోషల్ మీడియాను షేక్ చేసిన హీరో వరుణ్‌ సందేశ్‌ భార్య వితిక షేరూ....

TNN 15 Jul 2017, 8:37 pm
నాలుగు రోజుల క్రితం మీడియాలో వచ్చిన వార్తలతో సోషల్ మీడియాను షేక్ చేసిన హీరో వరుణ్‌ సందేశ్‌ భార్య వితిక షేరూ తాజాగా మరోసారి వార్తల్లోకెక్కారు. అయితే ఈసారి కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే ఆమె తీసుకున్న ఓ తాజా నిర్ణయం నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకునేందుకు కారణమైంది కనుక.
Samayam Telugu varun sandeshs wife vithika sheru donates her hair for cancer victims
మళ్లీ వార్తల్లోకెక్కిన వరుణ్ సందేశ్ భార్య


అవును, తాను ఎంతగో ఇష్టపడి పెంచుకొన్న జట్టులో కొంతభాగాన్ని క్యాన్సర్‌ బాధితులకి విరాళంగా ఇచ్చారామె. 'ఆహారం, డబ్బులాంటివి విరాళంగా ఇచ్చేవాళ్లు చాలామంది వుంటారు కానీ తాను మాత్రం అందుకు భిన్నంగా తాను ఏళ్లతరబడి ఎంతో ఇష్టంగా పెంచుకున్న జుట్టుని విరాళంగా ఇస్తున్నాను' అని పేర్కొన్నారు వితిక.

క్యాన్సర్‌ బాధితులకి అండగా నిలిచే ప్రయత్నంలో భాగంగా తన జుట్టులో కొంత భాగాన్ని కట్ చేసి క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అధ్యార్‌(చెన్నై)కు విరాళంగా ఇచ్చానని తన ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా తెలిపారామె. అందుకే ఈసారి సెలూన్‌కి వెళ్లినప్పుడు మీరు కూడా మీ వంతు ఆలోచన చేయండి అంటూ చివర్లో ఓ సలహా కూడా ఇచ్చారు వితిక షేరూ.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.