యాప్నగరం

వైరల్.. పెళ్లికొడుకుతో పరారైన గుర్రం!

అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తున్నారు. మంచి మ్యూజిక్ సిస్టమ్, ధూంధాం మధ్య పెళ్లికొడుకుని గుర్రం మీద ఊరేగిస్తున్నారు.

TNN 30 Apr 2017, 4:00 pm
అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తున్నారు. మంచి మ్యూజిక్ సిస్టమ్, ధూంధాం మధ్య పెళ్లికొడుకుని గుర్రం మీద ఊరేగిస్తున్నారు. మధ్య మధ్యలో గుర్రంతో కొన్ని ఫీట్లు కూడా చేయిస్తున్నారు. ఇంతలో ఆ గుర్రానికి ఏమైందో తెలీదు ఒక్కసారిగా పరుగులంకించింది. తన మీద కూర్చున్న పెళ్లికొడుకుతో సహా అక్కడి నుంచి పరారైంది. పెళ్లికొడుకు బంధువులు, అక్కడున్నవారు దాని వెనకాల పరిగెత్తాల్సి వచ్చింది. హాస్యంతో పాటు ఆశ్చర్యానికి గురిచేస్తున్న ఈ ఘటన మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ పట్టణంలో చోటుచేసుకుంది.
Samayam Telugu video horse runs away with bridegroom in a wedding
వైరల్.. పెళ్లికొడుకుతో పరారైన గుర్రం!


గుర్రం పెళ్లికొడుకుతో సహా పరారైన సంఘటనను కొంత మంది తమ స్మార్ట్‌ఫోన్లలో బంధించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకి ఆ గుర్రాన్ని పట్టుకున్నారా..? పెళ్లికొడుకు సురక్షితంగానే ఉన్నాడా..? అనే విషయాల గురించి ఎలాంటి సమాచారం లేదు. వీడియో చూడటానికి బాగుండటంతో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. మరి మీరూ ఓ లుక్కేయండి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.