ఊర్లల్లో మనకు సాధారణంగా పిల్లలు సైకిల్ టైరో లేదా మరేదైనా టైర్‌ను కర్రతో కొడుతూ.. టైర్‌ను ముందుకు నడుపుతూ.. ఆడుకుంటూ కనిపిస్తుంటారు. అందరిలా చేస్తే ఏంబాగుంటుందిలే అనుకున్నాడో ఏమో ఈ చిన్నోడు.. ఏకంగా బైక్ టైర్‌లోకి దూరేసి రయ్ రయ్ మంటూ విన్యాసం చేశాడు. టైర్ మధ్యలో దూరడమే కాకుండా అది పడిపోకుండా ఉండేలా బ్యాలెన్స్ చేస్తూ వీధుల్లో చక్కర్లు కొట్టాడు.టైర్లో కూర్చొని వీధి చివరి వరకు అలా వెళ్లి.. అక్కడి నుంచి రివర్స్‌లో అదే స్పీడ్‌లో టైర్‌ను నెట్టుకుంటూ వచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు.
ఈ పిల్లోడు చేసిన విన్యాసాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. అయితే ఇలాంటి ఫీట్లు చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శిక్షణ లేనిది చిన్నారులెవ్వరూ ఈ ఫీట్‌ను అనుసరించవద్దు అంటు వారంటున్నారు.