యాప్నగరం

మురళీధరన్‌నీ వదలని సెహ్వాగ్!

భారత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఈసారి శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ మురళీధరన్‌ను టార్గెట్ చేశాడు.

TNN 17 Apr 2017, 12:31 pm
సరదా ట్వీట్లతో నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తోన్న భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి తన ట్వీట్‌కి పనిచెప్పాడు. ఈ సారి శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్‌ను వీరూ టార్గెట్ చేశాడు. సోమవారం మురళీధరన్ పుట్టినరోజును పురష్కరించుకుని ఆయనకు ట్విట్టర్ ద్వారా వీరూ శుభాకాంక్షలు తెలిపాడు. అయితే ఆ శుభాకాంక్షల్లో కొంచెం చమత్కారం జోడించి.. వెటకారం మిక్స్ చేసి నెటిజన్లను నవ్వించాడు.
Samayam Telugu virender sehwag funny birthday wishes to muttiah muralitharan
మురళీధరన్‌నీ వదలని సెహ్వాగ్!


‘గొప్ప వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈయన బ్యాట్స్‌మెన్‌ను మాత్రమే ఆశ్చర్యానికి గురిచేయలేదు, తనను తాను చూసుకుని ఆశ్చర్యపోయాడు. బ్యాట్స్‌మెన్ అతన్ని మౌత్ ఆయ మురళీధరన్ అని అనుకుంటున్నారు’ అని ట్వీట్‌లో పేర్కొన్నాడు. దీనికి తోడు మురళీధరన్ బౌలింగ్ చేసేటప్పుడు పెట్టే ముఖకవలికను వీరూ ఫొటో రూపంలో ట్వీట్‌లో పొందుపరిచాడు. వాస్తవానికి మురళీధరన్ బంతిని బ్యాట్స్‌మెన్‌కు విసిరే సమయంలో కళ్లు పెద్దవి చేసి నోరు తెరుస్తారు. దీనిపైనే ఇప్పుడు వీరూ చమత్కరించాడు. వీరూ ట్వీట్‌కి ట్విట్టర్ యూజర్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ‘వీరూ సార్ వాటే సెన్సాఫ్ హ్యూమర్’ అని తెగ మెచ్చుకుంటున్నారు.
Happy Birthday to the great man,who not only surprised batsman but himself looked surprised & batsman used to think 'Maut Aaya Muralitharan' pic.twitter.com/nLgfsLpbp4 — Virender Sehwag (@virendersehwag) April 17, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.