యాప్నగరం

హచ్ కుక్క అసలు కుక్కే కాదంట

'ఆగ్మెంటెడ్‌ రియాలిటీ' అంటే కంప్యూటర్‌లో ఉండే చిత్రాల్ని వాస్తవిక ప్రపంచంలోకి తీసుకువచ్చినట్లు చూపరులకు భ్రమ కలిగించడం అన్న మాట.

TNN 27 Jan 2018, 3:12 pm
జగమంతా ఇప్పుడు 4జి మయం అయిపోయింది. 4జి సర్వీసులతో ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తూ మోబైల్ కంపెనీలు చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో జ్ఞాపకాలను ఓసారి తిరగేసుకుంటే గతంలో టెలివిజన్ స్క్రీన్లపై హచ్ కుక్క చేసిన హడావిడి గుర్తుకొస్తోంది కదా. ‘వేర్‌ ఎవర్‌ యు గో, అవర్ నెట్‌వర్క్‌ ఫాలోస్‌ యు’ అంటూ అప్పట్లో హచ్‌ కుక్కపిల్ల చేసిన హాడావిడి అంతా ఇంతా కాదు. తన యజమాని ఎక్కడికి వెళ్తే కుక్క పిల్ల కూడా అక్కడికి వెళ్లేది.
Samayam Telugu vodaphone hutchdog add in new technology
హచ్ కుక్క అసలు కుక్కే కాదంట


అయితే అసలు విషయం ఏమిటంటే అసలు అది కుక్క పిల్లే కాదంటా. మనకు యానిమేషన్, గ్రాఫిక్స్ మాత్రమే తెలుసు కదా. వీటిని తలదన్నే టెక్నాలజీ అయిన 'ఆగ్మెంటెడ్‌ రియాలిటీ' సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించి వోడోఫోన్ ఈ హచ్ కుక్కని తయారు చేసిందట. 'ఆగ్మెంటెడ్‌ రియాలిటీ' అంటే కంప్యూటర్‌లో ఉండే చిత్రాల్ని వాస్తవిక ప్రపంచంలోకి తీసుకువచ్చినట్లు చూపరులకు భ్రమ కలిగించడం అన్న మాట.

మొట్ట మొదటి సారిగా యాడ్స్ లో వోడాఫోన్ ఈ టెక్నాలజీని ఉపయోగించి అందర్ని అది నిజమైన కుక్కపిల్లే అని నమ్మించింది కదూ... అయితే ఇప్పుడు మరోసారి ఈ ప్రయోగాన్ని వోడాఫోన్ ప్రయోగించింది. ఈసారి ఏకంగా కుక్క పిల్లల గుంపునే దింపింది. టెన్నిస్ స్పోర్ట్స్ లీగ్ మ్యాచ్ లో వీటిని దించింది. వ్యాఖ్యాతలు కాసేపు వీటితో ఆటలాడారు కూడా. ఇదంతా చూసి ఆశ్చర్యపోవడం ప్రేక్షకుల వంతు అయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.