యాప్నగరం

డోలి మోసి.. మానవత్వం చాటుకున్న డాక్టర్

ఓ వైద్యుడు మానవత్వాన్ని చాటి ఆదర్శంగా నిలిచాడు. మారుమూల ఆదివాసీ గ్రామానికి వెళ్లి పురుడుపోయడమే కాకుండా అస్వస్థతకు గురైన తల్లీబిడ్డలను డోలీపై మోసుకుంటూ 8 కి.మీ. దూరంలో ఉన్న ఆసుపత్రికి తరలించాడు. ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా కూర్మనూరు పంచాయతీ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

TNN 4 Nov 2017, 10:05 am
కాసుల కోసం కక్కుర్తిపడే డాక్టర్లున్న ఈ కాలంలో.. ఓ వైద్యుడు మానవత్వాన్ని చాటి ఆదర్శంగా నిలిచాడు. మారుమూల ఆదివాసీ గ్రామానికి వెళ్లి పురుడుపోయడమే కాకుండా అస్వస్థతకు గురైన తల్లీబిడ్డలను డోలీపై మోసుకుంటూ 8 కి.మీ. దూరంలో ఉన్న ఆసుపత్రికి తరలించాడు. ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా కూర్మనూరు పంచాయతీ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అత్యంత మారుమూల గ్రామమైన సారిగెట్టకు చెందిన సువర్ణకు బుధవారం (నవంబర్ 1) పురిటినొప్పులు వచ్చాయి. కనీసం సమాచార వ్యవస్థ కూడా లేని ఆ గ్రామానికి వెళ్లాలంటే 3 చోట్ల నదిని దాటాలి.
Samayam Telugu watch doctor carries woman on cot for 8 km in odisha
డోలి మోసి.. మానవత్వం చాటుకున్న డాక్టర్


గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో పప్పులూరు వైద్యాధికారి ఓంకార్‌ హోత్తా.. స్థానిక పత్రికా ప్రతినిధితో కలిసి బైక్‌పై అతికష్టం మీద సరిగెట్ట గ్రామానికి వెళ్లాడు. సువర్ణకు ఆయన పురుడు పోయగా.. ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. కానీ, తల్లీబిడ్డల ఆరోగ్యం బాగాలేకపోవడంతో వెంటనే వాళ్లను ఆసుపత్రికి తరలించాలని ఓంకార్ సూచించాడు. వాళ్లను ఆసుపత్రికి తరలించడానికి గ్రామస్థులంతా వ్యతిరేకించారు.

చేసేదేంలేక ఓంకార్.. సువర్ణ భర్తకు నచ్చజెప్పి ఆమెను తరలించడానికి సిద్ధం చేశాడు. వాహన సదుపాయం కూడా లేకపోవడంతో చలించిన ఓంకార్‌.. సువర్ణ భర్తను పురమాయించి, తల్లీబిడ్డలను మంచంపై ఉంచి డోలీ కట్టి భుజానికెత్తున్నాడు. సుమారు 8 కి.మీ. దూరం పాటు కాలినడకన డోలిని మోసుకుంటూ పప్పులూరు ప్రాథమిక వైద్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.