యాప్నగరం

రసగుల్లా కోసం పెళ్లాగిపోయింది!

కట్నం తక్కువైందనో లేక అడిగిన లాంఛనాలు ఇవ్వలేదనో పెళ్లిళ్లు ఆగిపోవడం తెలుసు.

TNN 18 Apr 2017, 2:13 pm
కట్నం తక్కువైందనో లేక అడిగిన లాంఛనాలు ఇవ్వలేదనో పెళ్లిళ్లు ఆగిపోవడం తెలుసు. కానీ ఓ రసగుల్లా కోసం పెళ్లి ఆగిపోవడమేంటీ? అదే జరిగింది యూపీలోని ఉన్నావ్ జిల్లాలో. కుర్మాపూర్ గ్రామానికి చెందిన శివ్ కుమార్ కు అదే గ్రామానికి చెందిన కామిని పెళ్లి నిశ్చయించారు పెద్దలు. ఏప్రిల్ 14న పెళ్లిగా అనుకున్నారు. పెళ్లికి ముందు విందు ఏర్పాట్లు జరిగాయి. విందులో రసగుల్లా కూడా పెట్టారు వధువు తరుపువారు. అయితే అందరికీ ఒక్కో రసగుల్లానే వడ్డించాలని నిర్ణయించారు. వధువు బంధువు అలాగే వడ్డిస్తుండగా... వరుడి తమ్ముడు తనకు రెండు కావాలని అడిగాడు. దానికి వధువు బంధువు ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య వాగ్యుద్ధం మొదలైంది. అది చినికిచినికి గాలివానగా మారి ఇరువైపులా వారు కొట్టుకునే స్థాయికి వెళ్లింది.
Samayam Telugu wedding called off due to rasagulla in uttarpradesh
రసగుల్లా కోసం పెళ్లాగిపోయింది!


కంచాలు, స్పూనులు, అక్కడున్న ఆహార పదార్థాలు అన్నీ ఒకరి మీద ఒకరు విసురుకున్నారు. గొడవ ముదిరిపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. వారొచ్చి ఇరువైపులా సర్ది చెప్పారు. పెద్దమనుషులను పిలిపించి మాట్లాడి పెళ్లికి ఒప్పించారు. అయితే వధువు మాత్రం తాను పెళ్లి చేసుకోనని మొండికేసింది. రసగుల్లా కోసం ఇలా రచ్చరచ్చ చేయడమే కాకుండా... తన తండ్రి మీద కూడా చేయిచేసుకున్నారని ఆమె నిందించింది. దీంతో వరుడి తరుపు వారు వెనుదిరగాల్సి వచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.