యాప్నగరం

‘వేరే వాళ్లతో చూశాడని’.. భర్త నాలుక కోసేసింది!

దారుణం... పరాయి పురుషులతో గడుపుతూ భర్తకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన భార్య వారి సాయంతోనే అతడి నాలుక కోసేసింది.

TNN 11 Oct 2016, 7:00 pm
ఆడాళ్లపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని గొంతు చించుకునే వాళ్లు కూడా బిత్తరపోయే వార్త. పరాయి పురుషులతో రాసలీలలు సాగిస్తున్న భార్య వ్యవహారాన్ని భర్త చూసేయడంతో.. ఆమె అతడి నాలుక కోసేసింది. అసలు విషయం ఏంటంటే..
Samayam Telugu wife cuts her husbands tongue because of her illegal affair
‘వేరే వాళ్లతో చూశాడని’.. భర్త నాలుక కోసేసింది!

ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందిన జితేంద్ర, మీనాక్షి భార్యభర్తలు. కొన్నేళ్ల కిందట వీరు వేరే చోటి నుంచి సంబల్ ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు. ఇటుకబట్టీలో కూలీ పని చేస్తూ జితేంద్ర భార్యను పోషించేవాడు. బట్టీకి సమీపంలోనే ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఇద్దరూ కలిసి జీవించేవారు. ఓ రోజు రాత్రి పని నుంచి ఇంటికి తిరిగి వచ్చిన అతడికి ఇంట్లోని సంఘటన చూసి మైండ్ బ్లాంక్ అయ్యింది. తన భార్య ఒకే సమయంలో ఇద్దరు పురుషులతో రాసలీలల్లో మునిగి తేలుతూ కనిపించింది. వెంటనే మనోడికి కోపం కట్టలు తెంచుకుంది. కోపంతో ఊగిపోతూ వారిపై దాడికి ప్రయత్నించాడు. కానీ వారు ముగ్గురు, మనోడు ఒక్కడే కావడంతో ఏం చేయలేకపోయాడు. ఎదురు తిరిగిన వారు అతణ్ని గట్టిగా పట్టుకున్నారు. తమ విషయం బయటికి చెప్తాడేమోనన్న అనుమానంతో ఇద్దరు అతణ్ని పట్టుకోగా భార్య నాలుకను కోసేసింది. తర్వాత అతణ్ని కట్టేసి అక్కడి నుంచి ఉడాయించారు.
రక్తపు మడుగులో మూలుగుతూ కనిపించిన అతణ్ని గమనించిన ఇరుగుపొరుగు హాస్పిటల్లో చేర్చారు. డాక్టర్లు కుట్ల ద్వారా అతడి నాలుకను అతికించారు. తర్వాత అక్కడికి వచ్చిన బంధువులు చెప్పిన విషయాలు విని అక్కడున్న వాళ్లంతా నోరెళ్లబెట్టారు. అతడి భార్యకు పెళ్లికి ముందే చాలా మందితో ఎఫైర్ ఉండేదని, పెళ్లయ్యాక కూడా తన తీరు ఏ మాత్రం మారకపోవడంతో కుటుంబం పరువు పోయిందని.. దీంతో భార్యను తీసుకొని వేరే ఊరికి మకాం మార్చాడని జితేంద్ర బంధువులు తెలిపారు. పాపం మనోడు..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.