మొగుడ్ని చంపి.. పెళ్లి ఊరేగింపుకెళ్లింది
శరీరంపై రక్తపు మరకలు ఉన్నా.. ఊరేగింపు వేడుకలో భాగంగా రంగులు చల్లారేమోనని తాము భ్రమపడినట్లు
TNN 8 Mar 2017, 9:32 am
అర్ధరాత్రి మొగుడ్ని కర్కశంగా ఇంట్లోనే చంపి.. అనంతరం పెళ్లి ఊరేగింపునకు ఆనందంగా భార్య వెళ్లిన ఘటన న్యూదిల్లీలో చోటుచేసుకుంది. స్థానిక పారిశ్రామిక వాడలో పనిచేస్తున్న కమల్‌కి ఆరేళ్ల క్రితం హన్సితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. పెళ్లికి ముందు నుంచే మానసిక వ్యాధితో బాధపడుతున్న హన్సీకి క్రమంగా వ్యాధి ముదురుతూ వచ్చింది. ఇటీవల పట్టరాని కోపంతో అందరిపై అరుస్తూ ఉన్న హన్సీని ఓ మానసిక వైద్యుడి వద్ద కమల్ చికిత్స చేయిస్తున్నాడని స్థానికులు చెప్తున్నారు.
చికిత్సలో భాగంగా తీసుకురావాల్సిన మందులను గత రాత్రి కమల్ తేవడం మరిచిపోయాడట. దీంతో కాసేపు అతనితో గొడవపడిన హన్సీ.. కమల్ నిద్రించగానే కోపంతో సుత్తి తీసుకుని అతని తలపై బలంగా మోదడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అయినప్పటికీ.. హన్సీ కోపం చల్లారక కత్తితో కూడా పొడిచినట్లు శవపరీక్షలో తేలింది. అదే సమయంలోనే ఇంటి బయట పెళ్లి ఊరేగింపు జరగగా.. ఆ వేడుకకు సంతోషంగానే హన్సీ హాజరైనట్లు ఇరుగుపొరుగు వారు చెప్తున్నారు. అర్ధరాత్రి హన్సీ బట్టలు, శరీరంపై రక్తపు మరకలు ఉన్నా.. ఊరేగింపు వేడుకలో భాగంగా రంగులు చల్లారేమోనని తాము భ్రమపడినట్లు వారు వివరించారు. క్షణికావేశంలోనే హన్సీ ఈ హత్య చేసినట్లు నిర్ధారించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.