యాప్నగరం

కదులుతున్న రైల్లో.. యువతిపై దారుణం!

మొదటి నుంచి ఆమెను నిశితంగా గమనిస్తున్న ఆ ప్రబుద్ధుడు.. స్లీపింగ్ కార్‌లో సీట్లు ఉన్నాయని ఆమెను నమ్మించాడు.

TNN 13 Jun 2017, 1:43 pm
జైపూర్ - బాంద్రా ఎక్స్‌ప్రెస్‌లో దారుణం చోటు చేసుకుంది. కదులుతున్న రైల్లోనే 32 ఏళ్ల యువతిపై ఓ ప్రబుద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్‌లోని సూరత్ సమీపంలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.. జైపూర్ - బాంద్రా ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కిన ఓ మహిళకు సీటు దొరిక్కపోవడంతో నిల్చొనే ప్రయాణం సాగించింది. సీటు కోసం చాలా సేపు ప్రయత్నించినా.. ఎక్కడా ఖాళీ లేకపోవడంతో నిరాశగా ఓ చోట నిల్చుంది. ఒంటరిగా ప్రయాణిస్తున్న ఆ మహిళపై ఓ వ్యక్తి కన్ను పడింది. మొదటి నుంచి ఆమెను నిశితంగా గమనిస్తున్న ఆ ప్రబుద్ధుడు.. స్లీపింగ్ కార్‌లో సీట్లు ఉన్నాయని ఆమెను నమ్మించాడు. ప్రయాణికులందరూ నిద్రలోకి జారుకున్న సమయం చూసి.. సీటు చూపిస్తానంటూ ఆమెను పాంట్రీ కార్‌లోకి తీసుకెళ్లాడు.
Samayam Telugu woman allegedly raped in jaipur bandra express
కదులుతున్న రైల్లో.. యువతిపై దారుణం!


అక్కడికి వెళ్లగానే ఆమెను బలవంతంగా ఓ గదిలోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. ఘటన జరుగుతున్న సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవడం, రైలు వేగంగా పరుగెడుతుండటంతో ఆమెను ఎవరూ ఆదుకోలేకపోయారు.
Surat (Gujarat): A 32-year-old woman allegedly raped in Jaipur-Bandra Express's pantry car on pretext of a seat in a sleeping car (June 9) pic.twitter.com/y5P3PveUWo — ANI (@ANI_news) June 13, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.