యాప్నగరం

అమ్మాయితోనే అమ్మాయి జంప్!

ఇదో విచిత్ర ప్రేమకథ. అమ్మాయిలిద్దరూ ప్రేమలో పడ్డారు.

TNN 21 Nov 2016, 5:48 pm
ఇదో విచిత్ర ప్రేమకథ. గుజరాత్‌లోని రామోల్ గ్రామంలో తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది గీత (20). ఆమె ఇంట్లోనే ఉంటూ తల్లికి సాయంగా పనులు చేస్తోంది. ఓ యువకుడితో పెళ్లి కూడా కుదరింది. త్వరలోనే పెళ్లి ఏర్పాట్లు కూడా ప్రారంభమవ్వబోతున్నాయి. సరిగ్గా ఆ సమయంలోనే గీత ఇంట్లోంచి వెళ్లిపోయింది. తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సెల్‌ఫోన్ నెంబర్‌ను బట్టి పోలీసులు గీతను ట్రాక్ చేశారు. ఆమెను పట్టుకుందామనుకునేలోపే గీత తన ఫ్రెండ్‌తో కలిసి పోలీస్ స్టేషన్‌లో ప్రత్యక్షమైంది. ఆ ఫ్రెండ్‌తోనే తాను ఇష్టపూర్వకంగా వెళ్లిపోయినట్టు చెప్పింది. తీరా చూస్తే ఆ ఫ్రెండ్ ఎవరో కాదు తన చిన్నప్పటి స్కూల్‌మేట్ అయితే ప్రభ. ఓ అమ్మాయి. ఆ అమ్మాయితోనే గీతకు లవ్ అయిందంట. తామిద్దరం కలిసే ఉంటామని వారు పోలీసులకు ఖరాఖండిగా చెప్పారు. వాళ్ల వయసు రీత్యా కూడా మేజర్లు కావడంతో పోలీసులు ఏం చేయలేకపోయారు.
Samayam Telugu woman eloped to live with girlfriend in gujarath
అమ్మాయితోనే అమ్మాయి జంప్!


ప్రభ, గీత చిన్నప్పుడు ఒకే స్కూల్లో, ఒకే ఊరిలో ఉండేవారు. అనంతరం గీత పక్క ఊరికి వెళ్లిపోయింది. ప్రభ చిన్న ఆమ్లెట్ స్టాల్ పెట్టుకుని బతుకుతోంది. వీరి మధ్య చిగురించి ఇంట్లో వాళ్లకి తెలియకుండా ప్రేమాయణం నడిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.