యాప్నగరం

అమితాబ్ ఫోటో చూపెట్టి... దోచేశారు

ఓ యాంకర్ చిట్టిపొట్టి డ్రెస్ వేసుకుని స్ర్కీన్ మీదకి వస్తుంది.

TNN 30 Mar 2016, 1:00 pm
ఓ యాంకర్ చిట్టిపొట్టి డ్రెస్ వేసుకుని స్ర్కీన్ మీదకి వస్తుంది. అది కూడా కేవలం రాత్రివేళల్లో. స్క్రీన్ మీద సినీ ప్రముఖుల ఫోటోలు కాస్త బ్లర్ చేసి చూపించి... వారెవరో చెప్పమని అడుగుతారు. అలా చెప్పినవారికి లక్షల బహుమతి అంటారు. అలాంటి ఓ కార్యక్రమాన్ని నమ్ముకుని ఓ మహిళ ఏకంగా 1.75 లక్షల రూపాయలు పోగొట్టుకుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉంటోంది సఫియా భాను. ఆమె టీవీలో వచ్చే సినీ ప్రముఖుల ముఖాలను గుర్తించే ఓ కార్యక్రమానికి ఫోన్ చేసింది. వారు అమితాబ్ బచ్చన్ ఫోటోని బ్లర్ చేసి చూపించారు. సఫియా ‘అతను అమితాబ్ బచ్చన్’ అని చెప్పింది. వెంటనే ఆ కార్యక్రమ నిర్వాహకులు మీరు 12.80 లక్షల రూపాయలు గెలిచారు అని చెప్పారు. అప్పట్నించి అనేక ఫోన్ నెంబర్ల నుంచి కాల్స్ రావడం మొదలయ్యాయి. మీకు కార్ కావాలా లేక డబ్బులే తీసుకుంటారా అడిగారు ఓసారి. ఇలా ఫోన్ చేసి రకరకాల ప్రశ్నలు అడిగేవారు. చివరికి ఎకౌంట్ నెంబర్ ఇచ్చి అందులో డబ్బులు వేయమని అడిగారు. అలా అప్పుడప్పుడు సఫియా భాను డబ్బులు వేసింది. మొత్తం 1.75 లక్షల రూపాయల దాకా వేసింది. అయినా ఆవెు వస్తుందనుకున్న ప్రైజ్ మనీ రాలేదు. దీంతో మోసపోయినట్టు అర్థమై... సైబర్ క్రైమ్ కింద కేసు వేసింది.
Samayam Telugu woman identifies amitabh bachchan on tv loses 1 75 lakh
అమితాబ్ ఫోటో చూపెట్టి... దోచేశారు


Gujarati link:
http://navgujaratsamay.indiatimes.com/ahmedabad/crime/women-lost-1-75-lakh-after-identifying-amitabh-bachan/articleshow/51606834.cms

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.