యాప్నగరం

కేరళ యువ జర్నలిస్టు ఆకస్మిక మృతి

కేరళ యువ జర్నలిస్టు అనుశ్రీ పిళ్లై (29) తీవ్ర అనారోగ్యంతో మరణించారు.

TNN 14 Jun 2016, 12:33 pm
కేరళ యువ జర్నలిస్టు అనుశ్రీ పిళ్లై (29) తీవ్ర అనారోగ్యంతో మరణించారు. ఆమె కోచిలో టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్‌కు చెందిన లాంగ్వేజ్ వెబ్ సైట్ ‘మలయాళ సమయం’లో సీనియర్ కాపీ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. పదిరోజులుగా కడుపునొప్పితో ఆమె బాధపడుతున్నారు. సోమవారం కడుపునొప్పి తీవ్రంగా రావడంతో ఓ క్లినిక్‌కు వెళ్లారు. అక్కడ వారు ఓ ఇంజెక్షన్ ఇచ్చారు. వెంటనే అనుశ్రీ స్పృహ కోల్పోయారు. క్లినిక్ నుంచి వేరే ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అప్పటికే ఆమె మరణించినట్టు ధ్రువీకరించారు. అయితే కుటుంబసభ్యులు ఆమె మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇంజెక్షన్ కారణంగానే ఆమె మరణించిందనే అనుమానాలు రావడంతో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. అందులో అసలు కారణాలు తెలుస్తాయని అనుశ్రీ స్నేహితులు, శ్రేయోభిలాషులు అభిప్రాయపడుతున్నారు. అనుశ్రీ ఆరేళ్లుగా జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. మలయాళ సమయం వెబ్‌సైట్‌లో పనిచేయడానికి ముందు ఆమె న్యూస్ రీడర్‌గా కేరళ న్యూస్ ఛానళ్లు జైహింద్, ఇండియా విజన్, కేరళ విజన్‌లలో పనిచేశారు.
Samayam Telugu young kerala journalist anusree pillai dies
కేరళ యువ జర్నలిస్టు ఆకస్మిక మృతి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.