యాప్నగరం

యువరాజ్ పెళ్లికి రెడీ.. శుభలేఖ చూశారా?

స్టార్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ రెండు సార్లు పెళ్లి చేసుకోనున్నాడు. రెండు సార్లు రిసెప్షన్. సంగీత్‌తో ధూమ్ ధామ్ చేయనున్నాడు.

TNN 6 Nov 2016, 12:32 pm
భారత స్టార్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. ఒకసారి కాదు రెండుసార్లు పెళ్లి చేసుకోనున్నాడు. నవంబర్ 30న ఓ పెళ్లి చేసుకోనుండగా, డిసెంబర్ 2న మరో పెళ్లి చేసుకోనున్నాడు. మూడు రోజుల వ్యవధిలో రెండు పెళ్లిల్లా అని ఆశ్చర్యపోకండి. యువరాజ్ పెళ్లి చేసుకోబోయేది ఒక్కరినే, అదీ తన ప్రియురాలైన హాలీవుడ్ యాక్టర్ హజల్ కీచ్‌నే. ఈ నెల 30న సిక్కు సంప్రదాయం ప్రకారం వారి వివాహం జరగనుండగా, డిసెంబర్ 2న హిందూ సంపద్రాయ ప్రకారం గోవాలలో పెళ్లి జరగనుంది. గోవాలో జరగనున్న పెళ్లికి ఈ జంటకు అంత్యంత సన్నిహితులైన ముంబై ఫ్రెండ్స్ హాజరవుతారని తెలుస్తోంది. డిసెంబర్ 5న ఢిల్లీలో రిసెప్షన్ ఉంటుంది. తర్వాత ఏడో తేదీని చతర్‌పూర్‌లో మరో రిసెప్షన్ ఉంటుంది.
Samayam Telugu yuvraj singh and hazel keechs wedding cards ready
యువరాజ్ పెళ్లికి రెడీ.. శుభలేఖ చూశారా?


  Lakshmi Pooja! 🙏 hope everyone had a safe Diwali god bless . 🍰🍫🍥@hazelkeechofficial A photo posted by Yuvraj Singh (@yuvisofficial) on Oct 31, 2016 at 7:09am PDT
ఇక యువీ పెళ్లి కోసం కాదు కాదు.. యువరాజ్ హజల్ ప్రీమియర్ లవ్ లీగ్ కోసం రూపొందించిన శుభలేఖ భలే ఉంది. దాన్ని మొత్తం క్రికెట్‌‌తోనే నింపేశారు. ఈ శుభలేఖలో 'సంగీత్' ఆహ్వాన పత్రంపై కీచ్ బ్యాట్ పట్టుకుని ప్యాడ్స్ కట్టుకుని ఉన్న క్యారికేచర్‌ను ప్రచురించారు. ఐలవ్ క్రికెట్ అంటూ హజల్ అంటున్నట్లుగా డిజైన్ చేశారు. రిసెప్షన్ ఆహ్వానంలో పిచ్ మధ్యలో నిలుచున్న కొత్త జంటను చూసి 'భాయ్.. షాదీ..' అంటున్న ఇతర క్రికెటర్ల క్యారికేచర్లు ప్రచురించారు. పిచ్ మధ్యలో డోలు వాయిస్తున్న యువరాజ్, భల్లే భల్లే అంటూ డ్యాన్స్ చేస్తున్న కీచ్ చిత్రాలున్నాయి. కీచ్, యువరాజ్ క్యారికేచర్లతో పోస్టల్ స్టాంప్స్ కూడా రూపొందించారట.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.