యాప్నగరం

నోట్ల రద్దు: మొసళ్లకు పండగ, చేపలకు చావు

రద్దయిన పాత నోట్లపై అధికార పక్షం బీజేపీని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు కదం తొక్కాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలిరోజే రాజ్యసభలో సభ్యులు రూ500, రూ.1000 నోట్ల రద్దుపై సుధీర్ఘంగా చర్చించారు.

TNN 16 Nov 2016, 3:54 pm
రద్దయిన పాత నోట్లపై అధికార పక్షం బీజేపీని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు కదం తొక్కాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలిరోజే రాజ్యసభలో సభ్యులు రూ500, రూ.1000 నోట్ల రద్దుపై సుధీర్ఘంగా చర్చించారు.
Samayam Telugu crocodiles are surviving while fishes dying says yechuri
నోట్ల రద్దు: మొసళ్లకు పండగ, చేపలకు చావు


ముందస్తు సమాచారం ఇవ్వకుండా నోట్లను రద్దు చేసిన కేంద్రప్రభుత్వం సామాన్యులను కష్టాల్లోకి నెట్టిందని కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, టీఎంసీ, సీపీఎం సభ్యులు ఆరోపించారు.

నోట్ల రద్దు పెద్దపెద్ద మొసళ్ల(ధనవంతులు, వ్యాపారులు)పై ఏలాంటి ప్రభావం చూపడం లేదని, వారు హాయిగా ఉండగా, చిన్న చిన్న చేపలు (పేదలు, సామాన్యులు) మాత్రం చనిపోతున్నాయని సీపీఎం సభ్యుడు సీతారాం ఏచూరి విమర్శించారు.

90శాతం గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు లేవని నోట్ల రద్దు వల్ల 80శాతం పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు.

ప్రత్యామ్నాయం లభించేంత వరకు పాత నోట్ల చలామణి అయ్యేలా చర్యలు చేపట్టాలని ఏచూరి కేంద్రాన్ని కోరారు.

కొన్ని చోట్ల బీజేపీ నేతలు అధికమొత్తంలో రద్దయిన నోట్లతో నగదు మార్పిడికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.

నోట్ల రద్దు వల్ల పేదప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు.

నోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పరిష్కానం కనుగొనాలని జేడీయూ నేత శరద్ యాదవ్ ప్రభుత్వానికి సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.