యాప్నగరం

ట్రంప్ గెలుపు ప్రభావం కెనడాపై!

అమెరికాలో శ్వేతసౌధం వైపుగా ట్రంప్ అడుగులు వడివడిగా పడుతుండగా... ఆ ప్రభావం మొదట కెనడాపై కనిపిస్తోంది.

TNN 9 Nov 2016, 1:40 pm
అమెరికాలో శ్వేతసౌధం వైపుగా ట్రంప్ అడుగులు వడివడిగా పడుతుండగా... ఆ ప్రభావం మొదట కెనడాపై కనిపిస్తోంది. కెనడా ఇమ్మిగ్రేషన్ సైట్ http://www.cic.gc.ca/ మంగళవారం రాత్రి నుంచే ఓపెన్ కాకుండా మొరాయిస్తోంది. అమెరికా, కెనడా, ఆసియాలలోని యూజర్లకు ఎర్రర్ మెసేజ్ చూపిస్తోంది. ఆ సైట్ క్రాష్ కావడానికి ట్రంప్ గెలుపు సూచనలే కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Samayam Telugu canada immigration website appears to crash as donald trump lead grows
ట్రంప్ గెలుపు ప్రభావం కెనడాపై!


ఎన్నికలకు ముందు చాలా మంది అమెరికన్లు ట్రంప్ గానీ అధ్యక్షుడైతే తాము కెనడా పారిపోతామని సోషల్ మాధ్యమాల ద్వారా కామెంట్ చేశారు. మరికొంతమందైతే కెనడా అట్లాంటిక్ తీరంలోని కేప్ బ్రెటన్ ద్వీపానికి శరణార్ధులుగా వెళ్లిపోతామని వ్యాఖ్యానించారు.

ఇప్పుడు ట్రంప్ గెలుపు ఖాయమవ్వడంతో నిజంగా అమెరికన్ వాసులు కెనడా బాటపడతారనే భయంతోనే ఆ దేశ ఇమ్మిగ్రేషన్ సైట్ క్రాష్ అయినట్టు భావిస్తున్నారు. అలాగే ట్రంప్ గెలుపు అమెరికాలోని వివిధ దేశాల వారి ఉద్యోగాల పైనా కూడా పడనుండడంతో వారు కూడా కెనడా వలస వెళ్లేందుకు ప్రయత్నిస్తారన్న అనుమానంతో కూడా సైట్ ఓపెన్ కాకుండా చేస్తున్నారని పలువురు భావిస్తున్నారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు కెనడా ఉన్నతాధికారులు విముఖత చూపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.