యాప్నగరం

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కప్‌లకు సంబంధం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఓటింగ్‌కు ఒక్కరోజే గడువున్నా కొత్త విషయాలు బయటకు వస్తూనే ఉన్నాయి.

TNN 7 Nov 2016, 7:30 pm
ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఓటింగ్‌కు ఒక్కరోజే గడువున్నా ఈ ఎలక్షన్స్‌లో ఎవరు గెలుస్తారనే విషయాలపై రోజుకు ఓ సర్వేలో కొత్త విషయాలు బయటకు వస్తూనే ఉన్నాయి. రిపబ్లికన్‌ అభ్యర్థి ట్రంప్‌ గెలుస్తారని కొన్ని పోల్స్‌లో, డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ విజయం సాధిస్తుందని మరికొన్నింటిలో ఫలితాలు వస్తూనే ఉన్నాయి. కాగా న్యూయార్క్‌లోని హ్యాంప్టన్‌లోని ఒక షాప్ ఓనర్ వేలరీ స్మిత్‌ కప్‌ సర్వే అని కాస్త డిఫరెంట్ పోల్ చేపట్టారు. ఈమె తన షాప్‌లోని కప్పులు విక్రయించి సర్వే చేస్తారు. వాటిపై డొనాల్డ్‌ ట్రంప్‌, హిల్లరీ క్లింటన్‌ పేర్లు ఉంటాయి.
Samayam Telugu us election 2016 how a shop owner in the hamptons knows who will be president
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కప్‌లకు సంబంధం ఏమిటో తెలుసా?


ఎవరి పేరు ఉన్న కప్పులు ఎక్కువ అమ్ముడు పోతే వారే యూఎస్ ఎలక్షన్స్‌లో విజేతనంట. అయితే ఒక వ్యక్తి ఎన్ని కప్స్ కొన్నా దాన్ని ఒక కప్ కిందనే లెక్కేస్తారంట. ఈ సారి హిల్లరీ కప్పులు 4,946 అమ్ముడుపోగా ట్రంప్‌వి 3,388 అమ్మారు. కాబట్టి హిల్లరీనే విన్నర్. ఇది నిజమని మేము నమ్మాలా అని ప్రశ్నించకండి. గత మూడు ఎన్నికల్లో ఆమె సర్వే నిజమైందంట. అందుకే మనం నమ్మక తప్పదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.