యాప్నగరం

కామన్వెల్త్‌లో భారత్ పతకాల హాఫ్ సెంచరీ..!

కామన్వెల్త్ గేమ్స్‌ 2018లో భారత్ పతకాల జోరుని కొనసాగిస్తోంది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో శనివారం ఐదుకిపైగా

Samayam Telugu 14 Apr 2018, 2:09 pm
కామన్వెల్త్ గేమ్స్‌ 2018లో భారత్ పతకాల జోరుని కొనసాగిస్తోంది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో శనివారం ఐదుకిపైగా స్వర్ణ పతకాలు గెలుపొందిన భారత్ 51 పతకాలతో పట్టికలో మూడో స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. ఈరోజు ఉదయం బాక్సర్ మేరీకోమ్ పసిడి పతకంతో భారత్‌‌‌ని మురిపించగా.. అనంతరం బాక్సర్ గౌరవ్ సోలంకి మరో స్వర్ణంతో ఆ ఆనందాన్ని రెట్టింపు చేశాడు. తర్వాత కొద్దిసేపటికే జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా బంగారు పతకం గెలుపొందగా.. రెజ్లరు వినేశ్ పొగట్, సుమిత్ పసిడితో భారత్‌ స్వర్ణాల సంఖ్యని 23కి పెంచారు.
Samayam Telugu 555


పతకాల పట్టికలో ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న భారత్‌ ఖాతాతో 23 స్వర్ణాలతో పాటు 13 రజతాలు, 15 కాంస్యాలతో కలిపి మొత్తం 51 పతకాలు ఉన్నాయి. ఈ జాబితాలో ఆస్ట్రేలియా 179 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఇంగ్లాండ్ 114 పతకాలతో రెండో స్థానంలో ఉంది. భారత్ తర్వాత స్థానంలో ఉన్న కెనడా ఖాతాలో 79 పతకాలతో ఉన్నా.. పసిడి పతకాల్లో వ్యత్యాసం కారణంగా భారత్‌ మూడో స్థానంలో నిలిచింది. కెనడా ఖాతాలో ప్రస్తుతం 14 స్వర్ణాలు ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.