యాప్నగరం

కామన్వెల్త్ రికార్డ్స్ బ్రేక్.. జీతురాయ్‌కి స్వర్ణం

కామన్వెల్త్‌ గేమ్స్‌ 2018లో భారత క్రీడాకారులు క్రమంగా జోరు పెంచుతున్నారు. వెయిట్ లిఫ్టర్లు ఇప్పటికే 9 పతకాలు గెలుపొందగా.. షూటర్లు

Samayam Telugu 9 Apr 2018, 8:44 am
కామన్వెల్త్‌ గేమ్స్‌ 2018లో భారత క్రీడాకారులు క్రమంగా జోరు పెంచుతున్నారు. వెయిట్ లిఫ్టర్లు ఇప్పటికే 9 పతకాలు గెలుపొందగా.. షూటర్లు కూడా గట్టి పోటీనిస్తున్నారు. కామన్వెల్త్ క్రీడల రికార్డులని బద్దలు కొడుతూ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌ విభాగంలో ఆదివారం మనుబాకర్ స్వర్ణం గెలవగా.. సోమవారం ఈ విభాగంలోనే జీతురాయ్ కూడా సంచలన ప్రదర్శనతో పసిడి పతకాన్ని గెలుపొందాడు. మొత్తం 235.1 పాయింట్లు సాధించిన జీతురాయ్ కామన్వెల్త్ రికార్డుల్ని బ్రేక్ చేశాడు. అతనితో పాటు.. ఓం ప్రకాశ్ కూడా ఇదే ఈవెంట్‌లో 214.3 పాయింట్లతో కాంస్య పతకాన్ని గెలుపొందాడు.
Samayam Telugu 63675322


సోమవారం వెయిట్ లిఫ్టర్ ప్రదీప్ సింగ్ కూడా రజత పతకాన్ని గెలుపొందాడు. 105 కేజీల విభాగంలో పోటీపడిన ప్రదీప్.. మొత్తం 352 కిలోలు ఎత్తి వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత్‌కి 9వ పతకాన్ని అందించాడు. దీంతో.. ఈరోజు మూడు పతకాలు చేరడంతో ఇప్పుడు భారత్ ఖాతాలో ప్రస్తుతం 8 స్వర్ణాలు, 3 రజతాలు, 4 కాంస్యాలు ఉన్నాయి. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌ షూటింగ్‌లో ఆదివారం మను బాకర్‌తో పాటు హీనా సిద్దూ (రజతం), రవికుమార్ (కాంస్యం) గెలుపొందిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.