యాప్నగరం

కామన్వెల్త్‌ ముంగిట గాయపడిన పీవీ సింధు..!

అకాడమీలో ప్రాక్టీస్ చేస్తుండగా.. సింధు మడమకి గాయమైంది. దీంతో.. ఆమెకి ఎమ్‌ఆర్‌ఐ స్కానింగ్ చేయించగా.. ఎలాంటి ప్రమాదం లేదని

TNN 28 Mar 2018, 11:07 am
ఆస్ట్రేలియా వేదికగా కామన్వెల్త్ గేమ్స్ మరో వారంలో ప్రారంభంకాబోతున్నాయి. ఈ టోర్నీ కోసం హైదరాబాద్‌లోని గోపీచంద్ అకాడమీలో సన్నద్ధమవుతున్న పీవీ సింధు‌ మంగళవారం గాయపడింది. ప్రాక్టీస్‌లో ఆమె కుడి మడమకి గాయమైందని.. అయితే అది తీవ్రమైనది కాకపోవడంతో కామన్వెల్త్‌లో ఆమె పాల్గొంటుందని సింధు తండ్రి పీవీ రమణ మీడియాతో వెల్లడించారు. 2014లో గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌‌లో అసాధారణ ప్రతిభ కనబర్చిన సింధు.. కాంస్య పతకం గెలుపొందింది. ఏప్రిల్ 4 నుంచి 15 వరకు 2018 కామన్వెల్త్ క్రీడలు జరగనున్నాయి.
Samayam Telugu ...


‘అకాడమీలో ప్రాక్టీస్ చేస్తుండగా.. సింధు మడమకి గాయమైంది. దీంతో.. ఆమెకి ఎమ్‌ఆర్‌ఐ స్కానింగ్ చేయించగా.. ఎలాంటి ప్రమాదం లేదని తేలింది. ఎముకకి గాయం కాకపోవడంతో.. చిన్నపాటి విశ్రాంతినిస్తే చాలని వైద్యులు సూచించారు. అందుకే.. ఒకరోజు సింధు ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా.. మంగళవారం విశ్రాంతి తీసుకుంది. కామన్వెల్త్ గేమ్స్‌కి ఇంకా వారం సమయం ఉండటంతో.. ఎలాంటి కంగారు అవసరం లేదు’ అని పీవీ రమణ వెల్లడించారు. ప్రస్తుతం ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో కొనసాగుతున్న పీవీ సింధు.. భారీ అంచనాల మధ్య టోర్నీకి వెళ్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.