యాప్నగరం

కుక్కలపై జూదం.. అందుకే నాపేరు ‘పంటర్’.. ఈ పేరు ఎవరు పెట్టారంటే..?

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ను పంటర్ అనే ముద్దుపేరును ఎవరిచ్చారో తాజాగా సోషల్ మీడియాలో వెల్లడించాడు. తాను చేసిన పనులకు ఈ పేరును కేటాయించినట్లు చెప్పుకొచ్చాడు.

Samayam Telugu 27 Jan 2020, 10:56 pm
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ను అందరూ సరదాగా పంటర్ అని వ్యవహరిస్తారు. సాధారణంగా జూదగాళ్లను ఆ పేరుతో పిలుస్తారు. ఈక్రమంలో ఇన్నాళ్లుగా తనను పంటర్‌గా ఎందుకు పిలుస్తున్నారతో తాజాగా పాంటింగ్ సోషల్ మీడియాలో తెలిపాడు. ట్విట్టర్లో తన అభిమానులతో సరదాగా చిట్‌చేసిన పాంటింగ్.. తనకు ఆ పేరు ఎవరు పెట్టారో వివరించాడు.
Samayam Telugu ricky ponting
Ricky Ponting



Read Also : ధోనీ రిటైర్మెంట్‌పై చాహల్ ఆసక్తికర వ్యాఖ్యలు
1990 ప్రాంతంలో తాను క్రికెట్ అకాడమీలో ఉండేవాడినని, ఆ సమయంలో తనకు నెలకు 40 డాలర్ల స్టైయిఫండ్ ఇచ్చేవారని పాంటింగ్ గుర్తు తెచ్చుకున్నాడు. తన చేతికి డబ్బు రాగానే వెంటనే కుక్కల రేసు జరిగే ప్రాంతానికి వెళ్లేవాణ్నని తెలిపాడు. ఆయా రేసులపై పందెం కాయడం అప్పట్లో తన హాబీగా ఉండేదని చెప్పుకొచ్చాడు. ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ తనను పంటర్ అని సరదాగా పిలిచేవాడని, క్రమంగా అదే తనకు ముద్దు పేరుగా స్థిరపడిపోయిందని తెలిపాడు.

Read Also : ఐపీఎల్ 2020 ఫైనల్ ఆ స్టేడియంలోనే.. కారణలివే!
ఆస్ట్రేలియాకు రెండుసార్లు వన్డే వరల్డ్‌కప్ (2003, 2007) అందించి లెజెండరీ కెప్టెన్‌గా పాంటింగ్ గుర్తింపు పొందాడు. తాను ఆడిన కాలంలో ఆసీస్ ప్రపంచ క్రికెట్‌ను శాసించేది. మరోవైపు ఇటీవల టీమిండియాలో చోటు కోల్పోయిన రిషబ్ పంత్..త్వరలోనే జట్టులోకి రీఎంట్రీ ఇస్తాడని చిట్ ‌చాట్ సందర్భంగా జోస్యం చెప్పాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్రధాన కోచ్‌గా పాంటింగ్ పని చేస్తుండగా.. పంత్ ఆ టీమ్‌లో కీలక సభ్యుడన్న విషయం తెలిసిందే.

Read Also : ఐపీఎల్ 2020 మార్పులపై స్పందించిన సౌరవ్ గంగూలీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.