యాప్నగరం

​ ‘కంగారు’పెట్టిస్తున్న తమీమ్ ఇక్బాల్

​ ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లోనే ఇంగ్లాండ్‌పై శతకం బాదేసిన బంగ్లాదేశ్‌ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ ఫామ్‌ని కొనసాగిస్తున్నాడు

TNN 5 Jun 2017, 8:06 pm
ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లోనే ఇంగ్లాండ్‌పై శతకం బాదేసిన బంగ్లాదేశ్‌ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ ఫామ్‌ని కొనసాగిస్తున్నాడు. కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో సోమవారం జరుగుతున్న మ్యాచ్‌లో తమీమ్ (53 నాటౌట్: 77 బంతుల్లో 5x4, 1x6) అర్ధ శతకంతో సత్తాచాటాడు. దీంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న బంగ్లాదేశ్ 29 ఓవర్లు ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 109 పరుగులతో కొనసాగుతోంది.
Samayam Telugu australia vs bangladesh
​ ‘కంగారు’పెట్టిస్తున్న తమీమ్ ఇక్బాల్


ఓపెనర్ సౌమ్య సర్కార్ (3)తో పాటు ఇమ్రూల్ (6), ముష్ఫికర్ రహీమ్ (9) తక్కువ స్కోరుకే ఔటవడంతో ఒకానొక దశలో బంగ్లాదేశ్ 53/3తో పీకల్లోతు కష్టాల్లో నిలిచింది. ఈ సమయంలో షకిబ్ (29: 46 బంతుల్లో 2x4)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దిన తమీమ్ జట్టు పరువు నిలిపాడు. ఇన్నింగ్స్ 23వ ఓవర్ వేసిన హెన్రిక్యూస్ బౌలింగ్‌లో వరుసగా 6, 4, 4 బాదేసి తమీమ్ అర్ధశతకం పూర్తి చేసుకోవడం విశేషం. తమీమ్ క్రీజులో కొనసాగితే.. ఆస్ట్రేలియా బౌలర్లకి కష్టాలు తప్పవు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.