యాప్నగరం

బౌన్సర్ బంతి తగిలి.. మాక్స్‌వెల్ విలవిల

స్థానిక ఫాస్ట్ బౌలర్‌ బౌలింగ్‌లో మాక్స్‌వెల్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా.. అనూహ్యంగా బంతి బౌన్స్ అయ్యి

TNN 25 May 2017, 4:23 pm
ఇంగ్లాండ్‌లో జూన్ 1 నుంచి జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సన్నద్ధమవుతున్న ఆస్ట్రేలియా జట్టు కాసేపు కంగారెత్తిపోయింది. ఆ జట్టు హిట్టర్ మాక్స్‌వెల్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా.. ప్రమాదవశాత్తు బంతి అతని తలకు బలంగా తాకింది. దెబ్బకి నొప్పితో విలవిలలాడిపోయిన మాక్స్‌వెల్ క్షణాల వ్యవధిలోనే నెట్స్‌లో కుప్పకూలిపోయాడు. దీంతో పక్కనే ప్రాక్టీస్ చేస్తున్న సహచర క్రికెటర్లతో పాటు.. జట్టు డాక్టర్ బ్రంకర్ వేగంగా పరుగెత్తికెళ్లి మాక్స్‌వెల్‌కి సపర్యలు చేశారు.
Samayam Telugu champions trophy 2017 glenn maxwell hit on the head survives injury scare
బౌన్సర్ బంతి తగిలి.. మాక్స్‌వెల్ విలవిల


రెండు రోజుల నుంచి ఆస్ట్రేలియా జట్టు లార్డ్స్ మైదానంలో తమకి కేటాయించిన నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తోంది. అక్కడ స్థానిక ఫాస్ట్ బౌలర్‌ బౌలింగ్‌లో మాక్స్‌వెల్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా.. అనూహ్యంగా బంతి బౌన్స్ అయ్యి కుడి చెవి పైభాగంలో తాకింది. అయితే ప్రస్తుతం మాక్స్‌వెల్‌కి ఎలాంటి ప్రమాదం లేదని.. కాకపోతే ముందు జాగ్రత్త చర్యగా అతడ్ని హోటల్‌లో విశ్రాంతి తీసుకోమని సూచించినట్లు ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్‌స్మిత్ వెల్లడించాడు.

ఇటీవల ముగిసిన ఐపీఎల్ పదో సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకి కెప్టెన్‌గా ఉన్న మాక్స్‌వెల్.. టోర్నీలోనే అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. గత ఏడాది కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నా.. తాజాగా మెరుగైన ఫామ్‌తో ఈ హిట్టర్ ఆసీస్ జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు.
Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.