యాప్నగరం

ధోనీ సలహా‌తో బంగ్లా బౌలర్లని ఉతికేశాడు..!

నేను క్రీజులోకి వచ్చేసరికి వర్షం పడే సూచనలు కనిపించాయి. వాతావరణం మార్పుతో బంతి స్వింగ్ అవుతుండటంతో

TNN 31 May 2017, 3:28 pm
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ సలహాతోనే నయా హిట్టర్ హార్దిక్ పాండ్య బంగ్లాదేశ్ బౌలర్లపై బ్యాట్‌తో విరుచుకుపడ్డాడట. కెన్నింగ్టన్ ఓవెల్ వేదికగా మంగళవారం ముగిసిన వార్మప్ వన్డే మ్యాచ్‌లో హార్దిక్ పాండ్య (80 నాటౌట్: 54 బంతుల్లో 6x4, 4x6) అజేయ అర్ధశతకం బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్ల నష్టానికి 324 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
Samayam Telugu dhonis tips help me in finishing innings hardik pandya
ధోనీ సలహా‌తో బంగ్లా బౌలర్లని ఉతికేశాడు..!


ఈ మ్యాచ్‌లో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన హార్దిక్ పాండ్య తొలుత క్రీజులో కుదురుకునే వరకూ నెమ్మదిగా ఆడినా.. స్లాగ్ ఓవర్లలో భారీ షాట్లతో రెచ్చిపోయాడు. స్పిన్నర్లు, పేసర్లు అని తేడా లేకుండా గతి తప్పిన బంతుల్ని వరుసగా బౌండరీకి తరలించిన పాండ్య చివరి ఓవర్ వేసిన రుబెల్ హుస్సేన్ బౌలింగ్‌లో ఆఖరి బంతిని ధోనీ తరహాలో స్టాండ్స్‌లోకి తరలించి ఇన్నింగ్స్‌ని ఫినిష్ చేశాడు.

‘నేను క్రీజులోకి వచ్చేసరికి వర్షం పడే సూచనలు కనిపించాయి. వాతావరణం మార్పుతో బంతి స్వింగ్ అవుతుండటంతో బ్యాట్స్‌మెన్‌‌కి పరుగులు రాబట్టడం కష్టంగా ఉంది. బ్యాటింగ్‌కి వచ్చే ముందు ధోనీతో కాసేపు మాట్లాడాను. ఇంగ్లాండ్‌ పిచ్‌లపై క్రీజులో కొంతసేపైనా గడపగలిగితే ఆ తర్వాత బ్యాట్ ఝళిపించేందుకు అవకాశం పుష్కలంగా ఉంటుందని ధోనీ సూచించాడు. ఆ ప్రణాళిక ప్రకారమే నేను బ్యాటింగ్ చేసి జట్టుకి మెరుగైన స్కోరు అందించగలిగాను’ అని హార్దిక్ పాండ్య వివరించాడు. ఛేదనలో భారత్ బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ 84 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.