యాప్నగరం

ఇంగ్లాండ్‌తో ఫైనల్లో భారత్ ఢీకొంటే..?

సెమీ ఫైనల్లో ఎవరితో ఆడుతున్నామనేది ముఖ్యం కాదు. టోర్నీలో అన్ని మ్యాచ్‌లు ఆసక్తికరంగానే సాగుతున్నాయి.

TNN 13 Jun 2017, 3:58 pm
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ ,ఇంగ్లాండ్ ఢీకొంటే పోరు రసవత్తరంగా ఉంటుందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. టోర్నీలో ఇంగ్లాండ్ మెరుగ్గా ఆడుతోందని.. అలాంటి జట్టుతో భారత్ ఢీకొట్టాలని అభిమానులు కోరుకుంటున్నట్లు కోహ్లి వివరించాడు. బుధవారం జరగనున్న తొలి సెమీ ఫైనల్లో పాకిస్థాన్‌తో ఇంగ్లాండ్ తలపడనుండగా.. గురువారం రెండో సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్‌తో భారత్ అమితుమీ తేల్చుకోనుంది. టోర్నీ ఫైనల్ ఆదివారం జరగనుంది.
Samayam Telugu everybody wants india england final kohli
ఇంగ్లాండ్‌తో ఫైనల్లో భారత్ ఢీకొంటే..?


‘సెమీ ఫైనల్లో ఎవరితో ఆడుతున్నామనేది ముఖ్యం కాదు. టోర్నీలో అన్ని మ్యాచ్‌లు ఆసక్తికరంగానే సాగుతున్నాయి. ఫైనల్ చేరాలంటే భారత్ ఇక ఒక మ్యాచ్ గెలవాల్సి ఉంది. ప్రతి ఒక్కరూ భారత్ -ఇంగ్లాండ్ మధ్య ఫైనల్ జరగాలని కోరుకుంటున్నారు. రెండు జట్లు టోర్నీలో ఇప్పటి వరకు చాలా బాగా ఆడాయి. అభిమానులు కోరుకుంటున్నట్లు ఫైనల్ జరిగితే బాగుంటుంది’ అని కోహ్లి ఆశాభావం వ్యక్తం చేశాడు.

వ్యక్తిగతంగా ఏ జట్టు ఫైనల్ చేరితే బాగుంటుందని మీరు భావిస్తున్నారు..? అని ప్రశ్నించగా.. ‘ఏ జట్టు అయినా ఫర్వాలేదు. మేము ఫైనల్ చేరితే అదే మాకు సంతోషం’ అని కోహ్లి వివరించాడు. వాతావరణానికి అనుగుణంగా ఇంగ్లాండ్ పిచ్‌లని గౌరవించాలని.. ఇక్కడి పరిస్థితుల్ని అర్థం చేసుకుని బ్యాటింగ్ చేయడం ప్రతి బ్యాట్స్‌మెన్‌కు సవాలేనన్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.