యాప్నగరం

కోచ్‌ పదవిని భారత్‌ నాకు ఇవ్వదు: షేన్ వార్న్

. భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లితో ఇప్పటికీ నాకు సన్నిహిత సంబంధాలున్నాయి. కానీ

TNN 5 Jun 2017, 9:08 pm
భారత్ జట్టు ప్రధాన కోచ్‌‌ పదవిని బీసీసీఐ తనకు ఇవ్వదని ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ అభిప్రాయపడ్డాడు. ఛాంపియన్స్ ట్రోఫీ‌తో ప్రస్తుత కోచ్ అనిల్ కుంబ్లే ఒప్పందం ముగియనుండటంతో ఇటీవల కోచ్ కోసం బోర్డు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్ట్ కోసం షేన్ వార్న్ దరఖాస్తు కూడా చేసుకోలేదు.
Samayam Telugu i dont think they can afford me
కోచ్‌ పదవిని భారత్‌ నాకు ఇవ్వదు: షేన్ వార్న్


‘నేను చాలా ఖరీదు. కోచ్‌గా పనిచేసేందుకు నేను అడిగినంత బీసీసీఐ ఇవ్వదు. భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లితో ఇప్పటికీ నాకు సన్నిహిత సంబంధాలున్నాయి. కానీ నా పారితోషకం విషయంలో బోర్డు రాజీపడుతుందని నేను అనుకోవడం లేదు’ అని వార్న్ వివరించాడు.

అనిల్ కుంబ్లే పర్యవేక్షణలో గత ఏడాది నుంచి టెస్టుల్లో భారత్ అద్భుత విజయాలను నమోదు చేసిందని కొనియాడిన షేన్ వార్న్.. అతనే కోచ్‌గా కొనసాగితే జట్టుకి మేలు జరుగుతుందన్నాడు. ప్రస్తుతం వీరేంద్ర సెహ్వాగ్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ ప్రధానంగా కోచ్ రేసులో ఉన్న విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.