యాప్నగరం

పాక్ బౌలర్లని ఉతుకుతుంటే ఆ మజా..?

కెరీర్ సాంతం ఎంత మంది ప్రత్యర్థులతో ఆడినా.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లు ఆడేటప్పుడు తెగ ఎంజాయ్ చేసేవాడినని ఈ మాజీ ఓపెనర్ గుర్తు

TNN 18 Jun 2017, 1:12 pm
పాకిస్థాన్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ బౌండరీలు బాదడాన్ని తాను చాలా ఇష్టపడేవాడినని భారత డాషింగ్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య ఆదివారం మధ్యాహ్నం ఫైనల్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ ‘సహనంతో ఎలా ఉండాలో సౌరవ్ గంగూలీ నాకు నేర్పించాడు. అతనే నా ఫేవరెట్ కెప్టెన్. మైదానంలో టెన్షన్ పడకుండా ఎలా స్వేచ్ఛగా బౌండరీలు బాదాలో సచిన్ తెందుల్కర్ నేర్పించాడు’ అని వివరించాడు.
Samayam Telugu i loved to punish the pakistani bowlers
పాక్ బౌలర్లని ఉతుకుతుంటే ఆ మజా..?


కెరీర్ సాంతం ఎంత మంది ప్రత్యర్థులతో ఆడినా.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లు ఆడేటప్పుడు తెగ ఎంజాయ్ చేసేవాడినని ఈ మాజీ ఓపెనర్ గుర్తు చేసుకున్నాడు. ‘పాకిస్థాన్‌పై బౌండరీలు కొట్టడమంటే నాకు చాలా ఇష్టం. ప్రత్యేకంగా 150 కి.మీ వేగంతో బంతులు విసిరే షోయబ్ అక్తర్ బౌలింగ్‌లో’ అని వివరించాడు. ఇటీవల తనని తిడుతూ పాక్ మాజీ వికెట్ కీపర్ లతీఫ్ వీడియో విడుదల చేసినట్లు తనకు తెలిసిందని.. కానీ.. తను మాత్రం ఆ వీడియో చూడలేదన సెహ్వాగ్ వెల్లడించాడు.

వీడియోకి ప్రతిస్పందిస్తూ.. ‘అనవసరమైన మాటలకంటే.. అర్థవంతమైన మౌనం మేలు’ అంటూ సెహ్వాగ్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. సెహ్వాగ్ ఊరుకున్నా యువ క్రికెటర్ మనోజ్ తివారీ తనదైన శైలిలో లతీఫ్‌కి వీడియో ద్వారా బుద్ధి చెప్పాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.