యాప్నగరం

ఇంగ్లాండ్‌కి చావుదెబ్బ.. పాక్ టార్గెట్ 212

ఓపెనర్ జేసన్ రాయ్ స్థానంలో జట్టులోకి వచ్చిన బారిస్టో నిలకడగా ఆడినా.. మరో ఓపెనర్ అలెక్స్ హేల్స్

TNN 14 Jun 2017, 6:43 pm
ఛాంపియన్స్ ట్రోఫీలో ఓటమి ఎరుగకుండా సెమీస్ చేరిన ఇంగ్లాండ్ జట్టు తొలిసారి తడబడింది. పాకిస్థాన్‌ బౌలర్లు హసన్ అలీ (3/35), జునైద్ ఖాన్ (2/42), రుమాన్ రేస్ (2/44) ధాటికి కార్ఢిప్ వేదికగా జరుగుతున్న తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 211 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ బారిస్టో( 43: 57 బంతుల్లో 4x4), జో రూట్ (46: 56 బంతుల్లో 2x4), బెన్ స్టోక్స్ (34: 64 బంతుల్లో), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (33: 53 బంతుల్లో 4x4) క్రీజులో ఎక్కువ సేపు నిలిచినా.. కనీసం అర్ధశతకం కూడా సాధించలేకపోయారు. ముఖ్యంగా బెన్‌స్టోక్స్ వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేస్తూ.. ఇన్నింగ్స్ 48వ ఓవర్ వరకూ క్రీజులో నిలిచినా కనీసం ఒక ఫోర్ కూడా కొట్టలేకపోవడం కొసమెరుపు.
Samayam Telugu icc champions trophy 2017
ఇంగ్లాండ్‌కి చావుదెబ్బ.. పాక్ టార్గెట్ 212


ఓపెనర్ జేసన్ రాయ్ స్థానంలో జట్టులోకి వచ్చిన బారిస్టో నిలకడగా ఆడినా.. మరో ఓపెనర్ అలెక్స్ హేల్స్ (13) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరిపోయాడు. అనంతరం వచ్చిన జో రూట్‌తో కలిసి బారిస్టో ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కి 46 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. జట్టు స్కోరు 80 వద్ద బారిస్టో ఔటవగా.. కెప్టెన్ మెర్గాన్- రూట్ జోడి పాక్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంది కానీ.. స్కోరు బోర్డు మాత్రం వేగం అందుకోలేదు. పాక్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ.. ఇంగ్లాండ్‌పై ఒత్తిడి పెంచారు. బట్లర్ (4), మొయిన్ అలీ (11), అదిల్ రషీద్ (7), ఫ్లంకెట్ (9), మార్క్ఉడ్ (3) తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు. దీంతో 49.5 ఓవర్లలో ఇంగ్లాండ్ 211 పరుగులకు కుప్పకూలిపోయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.