యాప్నగరం

ఇంగ్లాండ్‌పై ఫీల్డింగ్ ఎంచుకున్న పాక్

శ్రీలంకతో జరిగిన చివరి మ్యాచ్‌లో ఛేదనకు దిగిన పాకిస్థాన్ ఒత్తిడికి తట్టుకుని విజయం సాధించడంతో సర్ఫరాజ్ అహ్మద్

TNN 14 Jun 2017, 2:45 pm
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తాజా టోర్నీలో ఓటమి ఎరుగని ఇంగ్లాండ్ గ్రూప్-ఎలోని అన్ని జట్లని ఓడించి సెమీస్ చేరింది. మరోవైపు భారత్ చేతిలో ఓడినా.. తర్వాత వరుసగా దక్షిణాఫ్రికా, శ్రీలంకపై గెలిచి పాక్ కూడా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది.
Samayam Telugu icc champions trophy 2017 1st semi final
ఇంగ్లాండ్‌పై ఫీల్డింగ్ ఎంచుకున్న పాక్


శ్రీలంకతో జరిగిన చివరి మ్యాచ్‌లో ఛేదనకు దిగిన పాకిస్థాన్ ఒత్తిడికి తట్టుకుని విజయం సాధించడంతో సర్ఫరాజ్ అహ్మద్ మరోసారి ఛేదనకే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్ జట్టుకి పాక్‌పై మంచి విజయాల రికార్డు ఉంది. వన్డే చరిత్రలోనే అత్యధిక స్కోరు 444 పరుగులు ఇంగ్లాండ్ చేసిందిపాకిస్థాన్‌పైనే కావడం విశేషం. అయితే తనదైన రోజున ఎలాంటి ప్రత్యర్థికైనా పాక్ సవాల్ విసరగలదు.

ఇంగ్లాండ్ జట్టు: అలెక్స్ హేల్స్, బారిస్టో, జో రూట్, మోర్గాన్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్, మొయిన్ అలీ, అదిల్ రషీద్, ఫ్లంకెట్, మార్క్‌వుడ్, జాక్ బాల్

పాకిస్థాన్ జట్టు: అజహర్ అలీ, ఫఖార్ జమామ్, బాబర్ అజామ్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, సర్ఫరాజ్ అహ్మద్, ఇమాద్ వసీమ్, రుమాన్ రేస్, షదాబ్ ఖాన్, హసన్ అలీ, జునైద్ ఖాన్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.