యాప్నగరం

పాకిస్థాన్ కాచుకో.. భారత్‌ వచ్చేసింది..!

డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి భారత్ అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరి మళ్లీ పాక్‌తో ఢీకొట్టేందుకు

TNN 15 Jun 2017, 9:44 pm
ఛాంపియన్స్ ట్రోఫీలో మళ్లీ దాయాదుల సమరం. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి భారత్ అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరి మళ్లీ పాక్‌తో ఢీకొట్టేందుకు సిద్ధమైంది. గురువారం జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ని మట్టికరిపించింది. 265 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ (123 నాటౌట్: 129 బంతుల్లో 15x4, 1x6) శతకంతో చెలరేగగా.. కెప్టెన్ విరాట్ కోహ్లి (96 నాటౌట్: 78 బంతుల్లో 13x4) అజేయ అర్ధ శతకం బాదేశాడు. దీంతో లక్ష్యాన్ని భారత్ కేవలం 40.1 ఓవర్లలోనే 265/1తో ఛేదించేసింది.
Samayam Telugu india cruise to final
పాకిస్థాన్ కాచుకో.. భారత్‌ వచ్చేసింది..!


బుధవారం ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించి పాకిస్థాన్ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. దీంతో ఆదివారం కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఆదివారం జరిగే ఫైనల్లో భారత్- పాకిస్థాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. టోర్నీ తొలి మ్యాచ్‌లోనే 124 పరుగుల తేడాతో పాక్‌ను భారత్ ఓడించిన విషయం తెలిసిందే.

అంతకముందు కేదార్ జాదవ్ (2/22), జస్‌ప్రీత్ బుమ్రా (2/40), భువనేశ్వర్ కుమార్ (2/53) ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 7 వికెట్ల నష్టానికి 264 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టులో ముష్ఫికర్ రహీమ్ (61: 85 బంతుల్లో 4x4), తమీమ్ ఇక్బాల్ (70: 82 బంతుల్లో 7x4, 1x6) అర్ధ శతకాలతో ఫర్వాలేదనిపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.