యాప్నగరం

కంగారొద్దు.. ఆ పిచ్‌ భారత్‌కి అచ్చొచ్చిందే

శ్రీలంకతో ఓటమి అనంతరం సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ జట్టు అద్భుత ...

TNN 14 Jun 2017, 5:06 pm
ఛాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ సెమీ ఫైనల్‌కి సిద్ధమైంది. బంగ్లాదేశ్‌తో గురువారం మధ్యాహ్నం 3 గంటలకి బర్మింగ్‌హామ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ వేదిక భారత్‌కి బాగా కలిసొచ్చిందని.. కచ్చితంగా టీమిండియా మెరుగైన ప్రదర్శన చేస్తుందని కెప్టెన్ విరాట్ కోహ్లి ధీమా వ్యక్తం చేశాడు.
Samayam Telugu india like birmingham pitch as it suits our game
కంగారొద్దు.. ఆ పిచ్‌ భారత్‌కి అచ్చొచ్చిందే


‘బర్మింగ్‌హామ్ స్టేడియంలో ఇప్పటికే టీమిండియా ఒక మ్యాచ్ ఆడింది. పిచ్ చాలా బాగుంది. భారత్ ఆటకి అది చక్కగా సరిపోతుంది. దక్షిణాఫ్రికాతో విజయం అనంతరం మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. పుంజుకునేందుకు ప్రతిచోటా అవకాశం ఉంటుంది. సెమీస్‌లో అభిమానుల్ని నిరాశపరచం’ అని కోహ్లి విశ్వాసం వ్యక్తం చేశాడు. ఈ వేదికపైనే పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్‌లోనే తలపడిన భారత్ 124 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.

శ్రీలంకతో ఓటమి అనంతరం సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ జట్టు అద్భుత ప్రదర్శనతో దక్షిణాఫ్రికాని ఓడించి టోర్నీలో పుంజుకుంది. ఆ మ్యాచ్‌లో బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్‌లోనూ సమష్టిగా రాణించింది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌పై ఎలాంటి ఒత్తిడి లేదని.. అంతమాత్రానా వారిని తక్కువ అంచనా వేయడం లేదని కోహ్లి స్పష్టం చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.