యాప్నగరం

భారత్-పాక్ మ్యాచ్ చూడాలి.. నా బదులు పెళ్లాడతారా?

భారత్-పాక్ మ్యాచ్ చూసేందుకు టికెట్లు కొన్నాను. కానీ ఆ రోజే నా పెళ్లి. నేను మ్యాచ్ చూసేందుకు వెళ్తాను. ఎవరైనా పెళ్లి చేసుకుంటారా?

TNN 30 May 2017, 10:41 am
భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో తెలిసిందే. దాయాదుల పోరు కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడంతో భారత్, పాకిస్థాన్ జట్లు క్రికెట్ ఆడి చాలా కాలమైంది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జూన్ 4న బర్మింగ్‌హమ్ వేదికగా ఇరు దేశాల మధ్య జరగనున్న మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందుకోసం ఎప్పుడో టికెట్లను కూడా కొనుగోలు చేశారు.
Samayam Telugu india vs pakistan match in champions trophy fan funny tweet
భారత్-పాక్ మ్యాచ్ చూడాలి.. నా బదులు పెళ్లాడతారా?


ఈ మ్యాచ్‌ చూడటం కోసం అందరి అభిమానుల్లాగే ఓ పాకిస్థానీ యువకుడు కూడా టికెట్లు బుక్ చేసుకున్నాడు. అప్పటికీ అతడికి ఎంగేజ్‌మెంట్ కూడా కాలేదు. తర్వాత పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేస్తే అది కాస్తా మ్యాచ్ రోజునే వచ్చింది. దీంతో నేను మ్యాచ్ చూసేందుకు వెళ్తాను. పెళ్లి చేసుకునేందుకు ఎవరైనా ఆసక్తిగా ఉన్నారా అని.. ఆరా తీయడం మొదలెట్టాడట. నా ఫ్రెండ్ విషయంలో ఇలా జరిగిందని అర్షద్ ఆఫ్రిదీ అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. ఇందులో ఎంత మేరకు నిజముందో తెలియదు గానీ.. భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే అభిమానులు ఎంత ఆసక్తి కనబరుస్తారనే విషయాన్ని మాత్రం మరోసారి వెల్లడైంది.

A friend of mine has ticket for India vs Pakistan match but.... pic.twitter.com/g5SgR4FWH7 — Arshad Afridi (@Arshad_Afridi) May 28, 2017
ఈ ట్వీట్‌కు స్పందిస్తూ ఒకసారి నాకూ ఇలాగే జరిగింది. వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోవడంతో నేను పెళ్లి టైంకి చేరుకున్నా అంటూ మరింత హాస్యాన్ని పండించే ప్రయత్నం చేశాడు. కొందరు భారత క్రికెట్ అభిమానులైతే.. ఈ మ్యాచ్‌లో ఎలాగో ఇండియా గెలుస్తుంది కాబట్టి.. నువ్వు భేషుగ్గా పెళ్లాడు.. అంటూ బదులిచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.