యాప్నగరం

స్పిన్నర్ జడేజాకి తియ్యటి వార్త..!

ఛాంపియన్స్‌ ట్రోఫీ ముగియకుండానే భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా సంబరాలు చేసుకునేంత తియ్యటి....

TNN 8 Jun 2017, 4:33 pm
ఛాంపియన్స్‌ ట్రోఫీ ముగియకుండానే భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా సంబరాలు చేసుకునేంత తియ్యటి వార్త. అతని భార్య రీవా సోలంకి గురువారం పండంటి పాపకి జన్మనిచ్చింది. శ్రీలంక‌తో మ్యాచ్ మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతుందన్న సమయంలో ఈ టెస్టు నెం.1 బౌలర్‌కి సంతోషకరమైన వార్త తెలిసింది. దీంతో భారత్ జట్టులో సందడి వాతావరణం నెలకొందట.
Samayam Telugu jadeja becomes father of a baby girl
స్పిన్నర్ జడేజాకి తియ్యటి వార్త..!


గత ఏడాది ఆరంభంలో రీవాతో వివాహ జీవితాన్ని ఆరంభించిన జడేజా.. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు తన భార్య గర్భవతని మీడియాకి వెల్లడించాడు. ‘తల్లిదండ్రులు, ప్రస్తుతం గర్భవతిగా ఉన్న నా భార్యను విడిచి ఇంగ్లాండ్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు సిద్ధమయ్యా. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్‌కి భారత్ జట్టులో నేను ఉండటం చాలా అవసరం. కుటుంబం కంటే.. దేశానికే నా మొదటి ప్రాధాన్యత. ఆటపై నాకు ఉన్న అంకిత భావాన్ని కుటుంబ సభ్యులు కూడా గౌరవిస్తున్నారు’ అని జడేజా అప్పట్లో చెప్పుకొచ్చాడు.

ఈ ఏడాది మార్చి‌లో రీవా సోలంకి‌ ఓ రోడ్డు ప్రమాదానికి గురైంది. అయితే లక్కీగా ఆమెకి ఎలాంటి గాయాలు కాకపోవడంతో జడేజా ఊపిరి పీల్చుకున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.