యాప్నగరం

కోహ్లి‌కి.. ఆ బంతులతో కుంబ్లే పరీక్ష..?

కీలకమైన పాకిస్థాన్‌తో పోరుకి ముందు ఇలాంటి అనధికార వార్తలకు చెక్ చెప్పాలనే ఉద్దేశంతో విరాట్ కోహ్లి,

TNN 3 Jun 2017, 2:29 pm
ఛాంపియన్స్ ట్రోఫీలో అందరి కళ్లు భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రదర్శనపైనే ఉన్నాయి. గత కొద్దిరోజులుగా జట్టు ప్రధాన కోచ్‌ అనిల్ కుంబ్లేతో కోహ్లికి విభేదాలు తలెత్తాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్‌తో ఆదివారం జరిగే మ్యాచ్‌లో భారత్ ఎలాంటి ప్రదర్శన చేస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Samayam Telugu kohli focus outside off
కోహ్లి‌కి.. ఆ బంతులతో కుంబ్లే పరీక్ష..?


రెండు రోజుల క్రితం నెట్స్‌లో కోహ్లి ప్రాక్టీస్ చేస్తుండగా.. కుంబ్లే రావడంతో అక్కడి నుంచి ఈ కెప్టెన్ వెళ్లిపోయాడనే వార్త చక్కర్లు కొడుతోంది. కీలకమైన పాకిస్థాన్‌తో పోరుకి ముందు ఇలాంటి అనధికార వార్తలకు చెక్ చెప్పాలనే ఉద్దేశంతో విరాట్ కోహ్లి, అనిల్ కుంబ్లే ఇద్దరూ కలిసి నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను విడుదల చేశారు. ఇందులో కోహ్లికి కుంబ్లే బౌలింగ్ చేస్తూ కనిపించాడు.

#CT17 @anilkumble1074 gives throwdowns to @imVkohli at nets in Edgbaston pic.twitter.com/ccEznXiOXY — TOI Sports (@toisports) June 2, 2017
పాకిస్థాన్‌ జట్టులో ఆఫ్ స్టంప్‌కి దూరంగా బంతులు విసురుతూ బ్యాట్స్‌మెన్ బుట్టలో వేయడంలో బౌలర్ మహ్మద్ అమీర్‌ది అందివేసిన చేయి. గత కొంతకాలంగా ఇలాంటి బంతులకే విరాట్ కోహ్లి వికెట్ సమర్పించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో నెట్స్‌లో ఎక్కువగా ఆఫ్ స్టంప్‌కి దూరంగా బంతులు విసురుతూ విరాట్ కోహ్లితో కోచ్ ప్రాక్టీస్ చేయించాడు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ప్రారంభంకానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.