యాప్నగరం

పాక్ ‘ఇడియట్’ క్రికెటర్ కోసం ఈ వీడియో

కానీ.. భారత్‌ని అవమానిస్తూ.. సెహ్వగ్‌ని నిందిస్తూ మాట్లాడిన లతీఫ్‌పై తాజాగా మరో భారత క్రికెటర్ మనోజ్ తివారీ వీడియో

TNN 12 Jun 2017, 6:00 pm
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ మధ్య పోరు ముగిసినా.. ఇంకా దాయాది దేశాల క్రికెటర్ల మధ్య మాటల యుద్ధం ముగియడం లేదు. జూన్ 4న జరిగిన మ్యాచ్‌లో 124 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను భారత్ మట్టికరిపించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ టీమిండియాని అభినందిస్తూ ట్వీట్ చేయగా.. దీనికి స్పందించిన పాక్ మాజీ వికెట్ కీపర్ రషీద్ లతీఫ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. అయితే సెహ్వాగ్ మాత్రం మళ్లీ తనదైన శైలిలో ‘అనవసరమైన మాటలకంటే అర్థవంతమైన మౌనం మంచిది’ అంటూ ట్వీట్ చేసి ఊరుకున్నాడు.
Samayam Telugu manoj tiwary calls rashid latif idiot
పాక్ ‘ఇడియట్’ క్రికెటర్ కోసం ఈ వీడియో


కానీ.. భారత్‌ని అవమానిస్తూ.. సెహ్వగ్‌ని నిందిస్తూ మాట్లాడిన లతీఫ్‌పై తాజాగా మరో భారత క్రికెటర్ మనోజ్ తివారీ వీడియో ద్వారా గట్టిగా బదులిచ్చాడు. పాక్ జట్టుకి వికెట్ కీపర్‌గా సేవలందించిన లతీఫ్‌కి కనీస సంస్కారం కూడా లేదంటూ దుమ్మెత్తిపోశాడు. ‘ఈ వీడియో మెసేజ్ రషీద్ లతీఫ్ అనే ఇడియట్ కోసం అతను పాకిస్థాన్ మాజీ క్రికెటర్’ అని మనోజ్ తివారీ సామాజిక మాధ్యమాల్లో వీడియో సందేశం ఉంచాడు.

Dis video message is 4 an idiot called Rashid Latif ( Former Pakistan wicketKeeper ) cont... pic.twitter.com/3dNICZQZ6Y — Manoj Tiwary (@tiwarymanoj) June 11, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.