యాప్నగరం

భారత్‌తో ఫైనల్ అనగానే.. అమీర్ రెడీ

నెట్స్‌లో ఈ రోజు చాలాసేపు అమీర్ బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. ప్రస్తుతం అతను పూర్తిగా ఫిటెనెస్ సాధించినట్లే. ఇక ఫైనల్లో

TNN 18 Jun 2017, 1:11 pm
వెన్నునొప్పి కారణంగా ఇంగ్లాండ్‌తో కీలకమైన సెమీస్ మ్యాచ్‌కి దూరమైన పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ భారత్‌తో ఫైనల్‌ కోసం బరిలోకి దిగుతాడట. టోర్నీ తొలి మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌‌లు ఆరంభ ఓవర్లలో అమీర్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌ మొత్తం ఆడిన రోహిత్ శర్మ కనీసం ఒక పరుగు కూడా రాబట్టలేకపోయాడు. దీంతో ఫైనల్‌లో కూడా అలాంటి ఆరంభాన్నే పాకిస్థాన్ కోరుకుంటోంది.
Samayam Telugu mohammad amir expected to feature in ct 2017 final
భారత్‌తో ఫైనల్ అనగానే.. అమీర్ రెడీ


‘నెట్స్‌లో ఈ రోజు చాలాసేపు అమీర్ బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. ప్రస్తుతం అతను పూర్తిగా ఫిటెనెస్ సాధించినట్లే. ఇక ఫైనల్లో అతడ్ని ఆడించాలా లేదా అనే నిర్ణయం తీసుకోవడం ఒకటే తరువాయి. సాధారణంగా ఒత్తిడి ఎక్కువగా ఉండే ఫైనల్ లాంటి మ్యాచ్‌ల్లో అనుభవం ఉన్న ఆటగాళ్లకి మొదటి ప్రాధాన్యత ఇస్తాం. కాబట్టి అతను తప్పకుండా ఆదివారం మ్యాచ్‌కి తుది జట్టులో ఉంటాడు. ఒకవేళ ఫిటెనెస్ టెస్టులో అతను ఫెయిల్ అయితే.. తర్వాత ఏంటని..? ఆలోచిస్తాం’ అని పాకిస్థాన్ బౌలింగ్ కోచ్ అజహర్ మహ్మద్ వెల్లడించాడు.

ఇంగ్లాండ్‌తో సెమీస్ మ్యాచ్‌కి అమీర్ స్థానంలో జట్టులోకి వచ్చిన రుమాన్ రాయిస్ 9 ఓవర్లు బౌలింగ్ చేసి 2 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌ రాయిస్‌కి తొలి వన్డే. దీంతో ఫైనల్‌లో అతను ఆడే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి ఫైనల్‌ మ్యాచ్ ఆరంభంకానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.