యాప్నగరం

పాక్‌తో ఫైనల్‌.. గాయపడిన అశ్విన్

అశ్విన్‌కి గాయమవడంతో పరుగున వచ్చిన ఫిజియో సపర్యలు చేసి.. ఐస్ ముక్కలను గాయంపై ఉంచుతూ ఉపశమనం

TNN 18 Jun 2017, 1:14 pm
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కి ముందు భారత్ అభిమానులకి చేదు వార్త. శనివారం ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మోకాలికి గాయమైంది. బంగ్లాదేశ్‌‌తో సెమీస్ మ్యాచ్‌లో ఆటగాళ్లు మైదానంలో కొన్ని తప్పిదాలు చేయడంతో ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ కఠినంగా ప్రాక్టీస్ చేయించాడు. సెషన్‌లో క్యాచ్‌ని అందుకునేందుకు ప్రయత్నించిన అశ్విన్ పట్టుతప్పి పడిపోయాడు. ఈ సమయంలోనే అతని శరీర బరువు మొత్తం కుడికాలు మోకాలిపై పడటంతో నొప్పితో ఆఫ్ స్పిన్నర్ కాసేపు విలవిలలాడిపోయాడు.
Samayam Telugu ravichandran ashwin injured during practice session
పాక్‌తో ఫైనల్‌.. గాయపడిన అశ్విన్


అశ్విన్‌కి గాయమవడంతో పరుగున వచ్చిన ఫిజియో సపర్యలు చేసి.. ఐస్ ముక్కలను గాయంపై ఉంచుతూ ఉపశమనం కలిగించాడు. అనంతరం ఫీల్డింగ్ ప్రాక్టీస్‌కి విరామం తీసుకున్న అశ్విన్.. అరగంట తర్వాత నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. అయితే అతని మోకాలికి ఉన్న ఐస్ ముక్కల ప్యాక్‌ని మాత్రం ఫిజియో తొలగించలేదు. దీంతో అతని ఫిటెనెస్‌పై సందేహాలు నెలకొన్నాయి. టీమిండియా మేనేజ్‌మెంట్ అశ్విన్ గాయంపై నోరు మెదపడం లేదు. పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు.. ప్రమాదకర భాగస్వామ్యాలను విడదీయడంతో అశ్విన్ సిద్ధహస్తుడు. పాకిస్థాన్‌తో ఫైనల్ మ్యాచ్‌లో అతను జట్టులో లేకపోతే ఎలా..?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.