యాప్నగరం

స్ఫూర్తి నింపలేకపోయావు.. పాక్ కోచ్ దిగిపో

అత్యంత ఆసక్తిని పెంచిన మ్యాచ్‌ ఏకపక్షంగా ముగిసేందుకు కోచ్ అర్థంలేని గేమ్ ప్లాన్‌లే కారణ...

TNN 6 Jun 2017, 9:08 pm
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ చేతిలో పాకిస్థాన్ ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ కోచ్ మిక్కీ ఆర్థర్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఆ దేశ మాజీ క్రికెటర్ మహ్మద్ యూసఫ్ డిమాండ్ చేశాడు. ఆదివారం ముగిసిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 124 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. జట్టులో స్ఫూర్తి నింపడంలో కోచ్ విఫలమయ్యారని.. అతను బాగా పనిచేస్తుంటే పాక్ ఎందుకు వన్డే ర్యాంకింగ్స్‌లో 8వ స్థానానికి పడిపోతుందని యూసఫ్ ప్రశ్నించాడు.
Samayam Telugu sacking of mickey arthur as pakistans coach
స్ఫూర్తి నింపలేకపోయావు.. పాక్ కోచ్ దిగిపో


ఛాంపియన్స్‌ ట్రోఫీలో అత్యంత ఆసక్తిని పెంచిన మ్యాచ్‌ ఏకపక్షంగా ముగిసేందుకు కోచ్ అర్థంలేని గేమ్ ప్లాన్‌లే కారణమని ఈ మాజీ క్రికెటర్ విమర్శించాడు. కోహ్లిపై మంచి రికార్డు ఉన్న జునైద్ ఖాన్‌ని పక్కకి తప్పించి.. కుడిచేతి వాటం బౌలర్‌కి అవకాశం ఇవ్వడం తెలివిలేని నిర్ణయమన్నాడు. ఏది ఏమైనా కీలక మ్యాచ్‌లో సరైన ప్రణాళికలతో పాక్ వెళ్లలేదని ఫలితంతో స్పష్టమైందని వివరించాడు.

సచిన్ తెందుల్కర్, విరాట్ కోహ్లి మధ్య పోలిక గురించి మాట్లాడుతూ ‘కోహ్లి చాలా నైపుణ్యమున్న బ్యాట్స్‌మెన్. కానీ.. నా ఓటు సచిన్‌కే వేస్తాను. ఎందుకంటే.. అతను ఆడిన తరంలో భీకరమైన ఫాస్ట్ బౌలర్లున్నారు. అత్యుత్తమ స్పిన్నర్లున్నారు. వారందరిపై పైచేయి సాధించడమంటే మామూలు విషయం కాదు’ అని యూసఫ్ వివరించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.