యాప్నగరం

వన్డేల్లో నెం.1 ర్యాంక్‌ కొట్టేసిన విరాట్ కోహ్లి

ఛాంపియన్స్ ట్రోఫీలో డివిలియర్స్, డేవిడ్ వార్నర్‌లు విఫలమవగా.. పాకిస్థాన్‌పై 81 పరుగులు, దక్షిణాఫ్రికా 76 పరుగులు

TNN 13 Jun 2017, 5:49 pm
ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుత ఫామ్‌ని కొనసాగిస్తున్న భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి వన్డేల్లో నెం.1 ర్యాంక్‌ని చేజిక్కించుకున్నాడు. ఈ టోర్నీ ఆరంభానికి ముందు నెం.1 స్థానంలో ఉన్న ఏబీ డివిలియర్స్ కంటే 22 పాయింట్లు తక్కువగా ఉండటంతో మూడో స్థానం‌తో ఉన్న కోహ్లి తాజాగా రెండు అర్ధ శతకాలు చేయడంతో అగ్రస్థానాన్ని అందుకోగలిగాడు.
Samayam Telugu virat kohli regains top spot
వన్డేల్లో నెం.1 ర్యాంక్‌ కొట్టేసిన విరాట్ కోహ్లి


ఐసీసీ మంగళవారం విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ జాబితాలో 862 పాయింట్లతో కోహ్లి మొదటి ర్యాంక్‌లో నిలవగా.. తర్వాత వరుసగా డేవిడ్ వార్నర్ (861), ఏబీ డివిలియర్స్ (847), జో రూట్ (798), విలియమ్సన్ (779) నిలిచారు. బౌలర్లు, ఆల్‌రౌండర్ల టాప్-5 జాబితాలో భారత్ బౌలర్లు ఎవరూ చోటు దక్కించుకోలేకపోయారు.

ఛాంపియన్స్ ట్రోఫీలో డివిలియర్స్, డేవిడ్ వార్నర్‌లు విఫలమవగా.. పాకిస్థాన్‌పై 81 పరుగులు, దక్షిణాఫ్రికా 76 పరుగులు చేయడం విరాట్ కోహ్లికి కలిసొచ్చింది. ప్రస్తుతం టోర్నీ‌లో 271 పరుగులతో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్న శిఖర్ ధావన్ (746 పాయింట్లు) ఐదు స్థానాలు మెరుగుపర్చుకుని పదో స్థానానికి ఎగబాకాడు. పేస్‌ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా మూడు స్థానాలు ఎగబాకి 43వ స్థానానికి చేరుకున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.