యాప్నగరం

World Cup 2019: ధోనీ రిటైర్మెంట్ సంకేతాలు.. ఆర్టిస్ట్‌గా సెకండ్ ఇన్నింగ్స్‌.. వీడియో వైరల్

వరల్డ్ కప్ ఆరంభానికి కొద్ది రోజుల మందు మహేంద్ర సింగ్ ధోనీ తనలోని మరో టాలెంట్‌ను బయటపెట్టారు. చాలా ఏళ్లపాటు క్రికెట్ ఆడానన్న ధోనీ.. ఇక నుంచి తనకు ఇష్టమైన పెయింటింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుంటానని సంకేతాలిచ్చాడు.

Samayam Telugu 20 May 2019, 4:24 pm
భారత్ క్రికెట్ గర్వించే గొప్ప ఆటగాళ్లలో మహేంద్ర సింగ్ ధోనీ ఒకడు. వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ.. ఇలా ఐసీసీ ట్రోఫీలన్నింటినీ గెలిచిన ఏకైక కెప్టెన్ ధోనీ అనే సంగతి తెలిసిందే. 2004లో భారత జట్టులోకి అడుగుపెట్టిన ధోనీ.. సుదీర్ఘ కాలంపాటు టీమిండియాకు సేవలు అందించాడు. ప్రపంచవ్యాప్తంగా ధోనీకి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఈసారి భారత్‌కు వరల్డ్ కప్ అందించాలనే కృతనిశ్చయంతో మహీ ఉన్నాడు. కోహ్లి దూకుడు, ధోనీ అనుభవం భారత్‌కు కలిసొస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
Samayam Telugu dhoni retire


ధోనీకి ఇదే చివరి వరల్డ్ కప్ అయ్యే అవకాశం ఉంది. క్రికెట్‌కు గుడ్ బె చెప్పిన తర్వాత ధోనీ ఏం చేస్తాడనే విషయం ఆసక్తికరమే కదా. ఈ విషయమై మహీ ఓ వీడియో ద్వారా పరోక్షంగా సంకేతాలిచ్చాడు. ఇప్పటికే చాలా క్రికెట్ ఆడానన్న ధోనీ.. ఈ ఆట నుంచి తప్పుకున్నాక... తనకు ఇష్టమైన పని చేస్తానని చెప్పుకొచ్చాడు.
మీకో రహస్యం చెబుతానన్న మహీ.. చిన్నప్పటి నుంచి తనకు పెయింటింగ్‌లు వేయడం అంటే ఇష్టమన్నాడు. ఇప్పటి వరకు తాను వేసిన పెయింటింగ్‌లను వీడియోలో చూపించాడు. తన పెయింటింగ్‌‌లతో ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నానని, దానికి కొంత సమయం పడుతుందని మహీ చెప్పాడు. వరల్డ్ కప్ ఆరంభానికి ముందు ధోనీ తనదైన స్టయిల్లో ఫ్యాన్స్‌కు రిటైర్మెంట్ గురించి హింట్ ఇచ్చాడని భావిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.