యాప్నగరం

World Cup: ఇంగ్లాండ్ ‘మెన్ ఇన్ బ్లూ’ జెర్సీ.. ఫ్యాన్స్ పెదవి విరుపు!

ఇంగ్లాండ్ జట్టు వరల్డ్ కప్ కిట్‌ను ఆవిష్కరించింది. 1992 జెర్సీ స్ఫూర్తితో దీన్ని రూపొందించారు. ఆ వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్ ఫైనల్ చేరింది. ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలని ఇంగ్లాండ్ కసితో ఉంది.

Samayam Telugu 22 May 2019, 4:53 pm

ప్రధానాంశాలు:

  • ఇంగ్లాండ్ జట్టు వరల్డ్ కప్ కిట్‌ను ఆవిష్కరించింది.
  • 1992 జెర్సీ స్ఫూర్తితో దీన్ని రూపొందించారు.
  • ఆ వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్ ఫైనల్ చేరింది.
  • ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలని ఇంగ్లాండ్ కసితో ఉంది.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu england jersey
వరల్డ్ కప్‌కి ఆతిథ్యం ఇస్తోన్న ఇంగ్లాండ్.. ఈసారి ఎలాగైనా కప్‌ను కైవసం చేసుకోవాలనే కసితో ఉంది. క్రికెట్ పుట్టినిల్లయినప్పటికీ.. ఇప్పటి వరకు ఇంగ్లాండ్ ఒక్కసారి కూడా వన్డే వరల్డ్ కప్‌ను సొంతం చేసుకోలేకపోయింది. గత రెండు వరల్డ్ కప్‌లను ఆతిథ్య దేశాలు సొంతం చేసుకున్న నేపథ్యంలో.. ఈసారి కూడా సెంటిమెంట్‌ తమకు కలిసొస్తుందని ఇంగ్లాండ్ భావిస్తోంది. వరల్డ్ కప్ ముందు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ జట్టు కోసం కొత్త కిట్‌ను సిద్ధం చేసింది. 1992 నాటి జెర్సీని తలపించేలా లైట్ బ్లూ కలర్‌లో కొత్త జెర్సీని రూపొందించింది.
1992 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్ జట్టు ఫైనల్ చేరింది. ఈసారి సొంత గడ్డ మీద హాట్ ఫేవరేట్‌గా బరిలో దిగుతున్న ఇంగ్లిష్ జట్టు.. తమకు కలర్ కూడా కలిసొస్తుందని భావిస్తోంది.

కాగా ఫ్యాన్స్ మాత్రం ఇంగ్లాండ్ జెర్సీ పట్ల పెదవి విరుస్తున్నాయి. కొత్త జెర్సీని గార్బేజీ బ్యాగ్‌లతో పోలుస్తున్నారు. వరల్డ్ కప్ 1990ల్లో జరిగితే సరిగ్గా నప్పేదని ఓ నెటిజన్ బదులిచ్చాడు. మెన్ ఇన్ బ్లూ భారత్ మాత్రమే అని ఇండియన్ ఫ్యాన్స్ ఈసీబీ ట్వీట్‌కు బదులిచ్చారు. ఇది ఇంగ్లాండ్ కిట్ కంటే ఇండియా కిట్‌గా అనిపిస్తోందని ఓ నెటిజన్ పంచ్‌లేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.